న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ టీమ్‌ఇండియాతో టీ20 సిరీసు ఆడటం లేదు. అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు టిమ్ సౌథీ సారథ్యం వహించనున్నాడు. టెస్టు సిరీసుకు మాత్రం కేన్ అందుబాటులో ఉండనున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు సెమీస్‌లో ఫేవరెట్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఫైనల్లో త్రుటిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌కు కెప్టెన్ విలియమ్సన్ అండగా నిలిచాడు. అద్భుతమైన అర్ధశతకంలో జట్టుకు పోరాడే స్కోరును అందించాడు.
ఆరు నెలలుగా కేన్ విలియమ్సన్ తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. భారత్‌లో తొలి అంచె ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీసులు ఆడాడు. మళ్లీ సెప్టెంబర్, అక్టోబర్లో ఐపీఎల్ రెండో అంచె ఆడాడు. ఆ తర్వాత ప్రపంచకప్‌లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఇవన్నీ బయో బడుగల్లోనే ఉండి ఆడాడు.
న్యూజిలాండ్ టీమ్‌ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. మొదట పొట్టి క్రికెట్ మ్యాచులు జరుగుతాయి. నవంబర్ 25 నుంచి మొదలయ్యే టెస్టు సిరీసుకు కేన్ అందుబాటులో ఉంటాడు.
న్యూజిలాండ్ టీ20 జట్టు
టాడ్ ఆస్ట్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్న్, డరైల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ
న్యూజిలాండ్ టెస్ట్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డరైల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, విల్ సోమర్‌విల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్
Also Read: Candice Warner on Twitter: హేళన చేయకు బ్రో.. సన్‌రైజర్స్‌కు సరైన రిప్లై ఇచ్చిన వార్నర్ భార్య
Also Read: T20 World Cup Prize Money: విశ్వవిజేతకు వచ్చింది ఇదే.. టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతంటే?
Also Read: Sachin Debut Day: ఆటగాడిగా వచ్చి.. దేవుడిగా ఎదిగి.. సచిన్ ఎంట్రీకి 32 ఏళ్లు!