నవంబర్ 15, 1989.. సరిగ్గా 32 సంవత్సరాల కిందట ఇదే రోజున భారత క్రికెట్లో కొత్త శకానికి అడుగు పడింది. లిటిల్ మాస్టర్, భారత క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్, పరుగుల యంత్రం.. ఇలా ఎన్నో ముద్దు పేర్లు, బిరుదులు ఉన్న సచిన్ టెండూల్కర్ అదేరోజున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారతదేశంలో క్రికెట్‌ను మతం స్థాయికి తీసుకెళ్లింది సచినే. తన శకంలో ఫ్యాన్ బేస్‌లో తనని కొట్టేవాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు.


రికార్డులు సృష్టించడం తనకు మంచి నీళ్లు తాగినంత ఈజీ. క్రీజులో సచిన్ ఉంటే మ్యాచ్ గెలిచేసినట్లే అన్న ఫీలింగ్‌లో భారత క్రికెట్ అభిమానులు ఉండేవారు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 187వ ఆటగాడు సచిన్ టెండూల్కర్. మరి సచిన్ తన మొదటి మ్యాచ్‌లో ఎంత పరుగులు చేశాడు? ఆ మ్యాచ్ భారత్ గెలిచిందా? ఓడిందా? డ్రా అయిందా?


చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సచిన్ టెండూల్కర్ 24 బంతుల్లో 15 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అదే సిరీస్ రెండో మ్యాచ్‌లో సచిన్ అర్థ సెంచరీ సాధించాడు.


అక్కడ మొదలైన సచిన్ రికార్డుల పర్వం ఎక్కడా ఆగలేదు. రిటైర్ అయి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ.. ఇప్పటి కొన్ని రికార్డులు తన పేరు మీదనే ఉన్నాయి. ఇప్పటికీ సచిన్ పేరు మీదనే ఉన్న పలు రికార్డులు ఇవే..


1. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు - 200
2. టెస్టుల్లో అత్యధిక పరుగులు - 15,921
3. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు - 51
4. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక ఫోర్లు - 2,058
5. వన్డేల్లో ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు - 1,894
6. వన్డేల్లో అత్యధిక సెంచరీలు - 49
7. వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు - 96
8. అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు - 20
9. మొత్తం కెరీర్‌లో అత్యధిక 50కి పైగా స్కోర్లు - 264


Also Read: T20 World Cup 2021: మీమ్‌ క్రియేటర్లకు షాక్‌..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!


Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం


Also Read: Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు


Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి