ఉగాండా రాజధాని కంపాలాలో వరుస పేలుళ్లు జరిగాయి. అయితే భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రస్తుతం అక్కడే ఉండటంతో యావత్ దేశం ఆందోళన చెందింది.  అయితే వారు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.  






మన జట్టు సేఫ్..


భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రస్తుతం ఉగాండాలోని కంపాలాలో ఉంది. అయితే అక్కడ జరిగిన ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు. మన జట్టు ఆతిథ్యం తీసుకున్న హోటల్‌కు 100 మీటర్ల దూరంలో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో భారత ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు కొద్ది రోజుల క్రితం ఉగాండా వెళ్లింది. ఈ జట్టులో టోక్యో పారాలింపిక్స్-2021లో పతక విజేతలు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, ఇతర ఆటగాళ్లు ఉన్నారు.


రెండు పేలుళ్లు..






అయితే రెండు పేలుళ్లు జరిగాయని పలువురు గాయపడ్డారని ఎన్టీవీ ఉగాండా తెలిపింది.





పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పలు పేలుళ్లు జరిగాయని, పలువురు గాయపడ్డారని ఉగాండా సైనిక ప్రతినిధి తెలిపారు. అయితే మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఉగాండా రెడ్‌క్రాస్ ప్రతినిధి తెలిపారు. 


Also Read: Durham University: అరేయ్ ఏంట్రా ఇది.. 'వ్యభిచారం'పై యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ!