Durham University: అరేయ్ ఏంట్రా ఇది.. 'వ్యభిచారం'పై యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ!

ABP Desam   |  Murali Krishna   |  16 Nov 2021 05:44 PM (IST)

వ్యభిచారంపై ప్రత్యేక కోర్సు పెట్టింది ఓ విశ్వవిద్యాలయం. అసలు దీని సంగతేంటో మీరే చదవండి.

'వ్యభిచారం'పై యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ

వ్యభిచారం.. అసలు ఈ పేరు వింటేనే చాలా మంది  ఛీఛీ అంటారు. మన దేశంలో వ్యభిచారం కూడా నేరమే. కానీ ఇంగ్లాండ్‌లోని దుర్హమ్ విశ్వవిద్యాలయం మాత్రం వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకునేవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదేంటి వ్యభిచారానికి కూడా శిక్షణ ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదేంటో మీరే చూడండి.

ఆన్‌లైన్ క్లాసులు..

దుర్హమ్ యూనివర్సిటీ.. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు వ్యభిచారం చేసే సమయంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనుంది. 

అయితే తమ యూనివర్సిటీ నుంచి బయటికొచ్చిన చాలా మంది గ్యాడ్యుయేట్లు వ్యభిచార వృత్తిలోకి వెళ్లాలని ఆసక్తి చూపుతున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.

అడల్ట్ సెక్స్ ఇండస్ట్రీలోకి వెళ్లాలనుకునే వారికి యూనివర్సిటీ ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తుందని విశ్వవిద్యాలయం స్టూడెంట్స్‌ యూనియన్.. విద్యార్థులు, సిబ్బందికి మెయిల్ చేసింది.

భద్రతే లక్ష్యం..

ఈ కోర్సును దుర్హం విద్యార్థి సంఘమే రూపొందించింది. యూనివర్సిటీ గ్యాడ్యుయేట్స్ ఎక్కువ మంది వ్యభిచారం సహా సెక్స్ కోర్సులపై ఆసక్తి చూపుతుండటమే ఇందుకు కారణం. వ్యభిచారంలోకి అడుగుపెట్టేవారికి సరైన సూచనలు ఇవ్వడమే లక్ష్యంగా ఈ తరగతులు రూపొందిచారు.

వ్యతిరేకత..

ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై వ్యతిరేకత వచ్చింది. విద్యార్థుల భద్రతను చూడాల్సిన యూనివర్సిటీలు ఇలాంటి కోర్సులను ఆఫర్ చేయడం సరైన పద్ధతి కాదని యూకే విశ్వవిద్యాలయాల మంత్రి డోనెలాన్ అన్నారు.

Published at: 16 Nov 2021 05:40 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.