కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిజిటలీకరణ ప్రక్రియ వేగవంతమైంది. బ్యాంకింగ్ రంగమూ ఈ మార్పును వేగంగా అందిపుచ్చుకుంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో ఈ-కేవైసీ ధ్రువీకరణ సులభంగా మారిపోయింది. ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులకు నేరుగా రావాల్సిన అవసరమే లేదు. వీడియో కేవైసీ సౌకర్యం ఉపయోగించుకుంటే చాలు! వీడియో ఆధారంగానే గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
వీడియో కేవైసీ విధానం
- వీడియో కేవైసీ సౌకర్యం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు.
- వీడియో ద్వారా వెరిఫికేషన్ అయిపోతుంది కాబట్టి చెక్‌బుక్, ఏటీఎం కార్డు నేరుగా నమోదు చేసుకున్న చిరునామాకు వచ్చేస్తాయి.
- వీడియో కేవైసీ చేసుకోవాలంటే మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు (మొబైల్, ఈమెయిల్ లింక్ అవ్వాలి) అవసరం.
- వీడియో అవసరం కాబట్టి మీ ల్యాప్‌ట్యాప్ లేదా కంప్యూటర్ లేదా మొబైల్‌కు కెమేరా, మైక్రోఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం తప్పనిసరి.
- యూఐడీఏఐ, ఎన్‌ఎస్‌డీఎల్ సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి.ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
- కెమేరా, మైక్రోఫోన్, లోకేషన్ యాక్సెస్‌కు అనుమతి ఇవ్వాలి.
- బ్యాంకు అధికారులు మీ ఫొటోగ్రాప్ తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.
- పాన్, సంతకం ఫొటో తీసుకుంటారు.
- వీడియో కేవైసీ పూర్తి అవ్వగానే మీ ఖాతా ఓపెన్ అవుతుంది.
- ఖాతా తెరిచాక ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి.
- ఆ తర్వాత ఏటీఎం, నెట్, మొబైల్ బ్యాంకింగ్‌ను చక్కగా వాడుకోవచ్చు.
Also Read: PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!
Also Read: Financial Lessons for Kids: మీ పిల్లలకు ఈ 6 'డబ్బు' పాఠాలు నేర్పండి!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?