ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) ఒక మంచి అవకాశం. ఇందులో నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.కోటి మీ చేతికి అందుతాయి.


ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినా ఎక్కువ మందిని ఆకట్టుకున్నది మాత్రం ఇదే! ఎందుకంటే పెట్టుబడి సురక్షితం, మంచి వడ్డీరేటు లభిస్తుండటమే కారణాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్‌ను సులభంగా కట్టుకోవచ్చు.


కనీస పెట్టుబడి రూ.500


నెలకు రూ.500 కనీస మొత్తంతో పీపీఎఫ్‌ను ఆరంభించొచ్చు. గరిష్ఠంగా నెలకు రూ.12,500 లేదా ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి వడ్డీరేటు ముడుతుంది. సాధారణంగా పీపీఎఫ్‌ మెచ్యూరిటీ సమయం 15 ఏళ్లు కాగా ఐదేళ్ల పాటు రెండుసార్లు పొడగించుకోవచ్చు.


ఎంత వడ్డీ?


ప్రస్తుతం పీపీఎఫ్‌ మీద వార్షిక వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. ప్రభుత్వం నెలవారీ వడ్డీని ఏటా మార్చి తర్వాత పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఖాతా తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దలూ పీపీఎఫ్‌ నిర్వహించొచ్చు.


పన్ను మినహాయింపు?


ఈ పథకం ఆదాయపన్ను మినహాయింపు కిందకు వస్తుంది. సెక్షన్‌ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు.


రూ. కోటీ ఎలా వస్తుందంటే?


ఈ పథకం ద్వారా మెచ్యూరిటీ సమయానికి కోటి రూపాయాలు పొందాలంటే గరిష్ఠంగా 25 ఏళ్ల వరకు ఖాతాను కొనసాగించాలి. అంటే ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున మీరు రూ.37,50,000 జమ చేస్తారు. ఇక 7.1 శాతం వడ్డీరేటు ప్రకారం మీకు రూ.65,58,012 వడ్డీగా అందుతాయి. మొత్తం రూ.1,03,08,012 మీరు పొందుతారు. సాధారణంగా మెచ్యూరిటీ సమయం 15 ఏళ్లే అయినా ఐదేళ్ల పాటు రెండుసార్లు కాలపరిమితి పెంచుకోవచ్చు. అలా చేస్తేనే మీకు కోటి సొంతం అవుతుంది.


Also Read: World's Richest Country: అమెరికాకు షాక్‌!! అత్యంత సంపన్న దేశంగా చైనా.. 20 ఏళ్లలోనే యూఎస్‌ను వెనక్కినెట్టిన డ్రాగన్‌


Also Read: Bank Account Video KYC: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరవొచ్చు.. ఈ-కేవైసీతో సింపుల్‌గా.. ఇంటి వద్ద నుంచే..!


Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్‌ ఇదే!


Also Read: Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా


Also Read: Petrol-Diesel Price 17 November 2021: గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి