Petrol-Diesel Price 17 November 2021: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇంధన ధరలపై స్వల్ప ఊరట కలిగించింది. కానీ అంతలోనే ఇంధన ధరలు మండుతున్నాయి. వాహనదారుల జేబులకు తూట్లు పడుతున్నాయి. కేంద్రం ప్రకటనతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం కొంతమేర పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం తాము ధరలు పెంచలేదని, తగ్గించేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొండంత పెంచి గోరంత తగ్గించిందనే తీరుగా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 వద్ద, డీజిల్ లీటర్ ధర రూ.86.67 వద్ద గత రెండు వారాలుగా స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62గా ఉంది. హైదరాబాద్ తో పోల్చితే జిల్లాల్లో మాత్రం ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక వరంగల్‌లో 27 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర లీటర్ రూ.107.96 అయింది. డీజిల్ ధర రూ.94.39 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.07, డీజిల్ ధర రూ.94.49కు చేరింది.
Also Read: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.15 పైసలు తగ్గింది పెట్రోల్ లీటర్ ధర. రూ.108.34 అయింది. డీజిల్ ధర రూ.0.24 పైసలు తగ్గి రూ.94.74 అయింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.12 పైసలు తగ్గడంతో రూ.109.51 కి దిగొచ్చింది. డీజిల్ ధర రూ.0.49 పైసలు తగ్గడంతో రూ.95.83 అయింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఏపీలో ఇంధన ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. విజయవాడలో 15 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.110.23 అయింది. డీజిల్ ధర 14 పైసలు తగ్గి రూ.96.31కి దిగొచ్చింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. ఇక్కడ లీటర్ ధర ప్రస్తుతం రూ.109.40గా ఉంది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.50 వద్ద స్థిరంగా ఉంది. తిరుపతిలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 81 పైసల మేర పెరగడంతో తిరుపతిలో లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.93 అయింది. 73 పైసలు చొప్పున పెరగడంతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో డీజిల్ ధర 96.91కి పెరిగింది. అనంతపురంలో 35 పైసల మేర తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.110.25కి దిగిరాగా.. 33 పైసలు తగ్గడంతో లీటర్ డీజిల్ ధర రూ.96.35కు చేరింది.
Also Read: ఈ ఐటీ స్టాక్ 18 నెలల్లో లక్షకు రూ.16.65 లక్షల రాబడి ఇచ్చింది.. ఏం కంపెనీయో తెలుసా?