సీఎం కేసీఆర్‌ ఎవరి కోసం ధర్నా చేశారో ఆయనకే తెలియదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఎందుకు ధర్నా చేశారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ దీక్ష చేస్తే మోదీ సాగుచట్టాలు రద్దు చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా పంజాబ్‌ రైతుల కోసమా అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్​ను​ బయటికి రప్పించామని బండి సంజయ్ అన్నారు. ధర్నా చౌక్‌ వద్దన్న కేసీఆర్‌ అక్కడే ధర్నాకు కూర్చున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్న కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల కోసమే సీఎం కేసీఆర్‌ ధర్నా చేశారని బండి సంజయ్ ఆరోపించారు.





 


రైతులపై రాళ్లదాడి


తన పర్యటనను అడ్డుకునేందుకు రైతులు, బీజేపీ నేతలపై రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్న ఆయన... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులను పట్టించుకోకుండా పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తారా అని నిలదీశారు. 


Also Read: ఈ థియేటర్లలో సినిమాకి వెళ్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్!


తెలంగాణ రైతులకు రూ.25 లక్షల పరిహారం 


కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నా అందులో 10 శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేదని బండి సంజయ్ ఆరోపించారు. 'కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లు తేవొద్దంట.  వడ్లను యాడ పోసుకోవాలి. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా తడిసిన వడ్లు ప్రతి గింజా కొనాల్సిందే. దిల్లీలోనంట రైతులు చనిపోయిండ్రంట. వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాడట. ముందుగా తెలంగాణలో వేలమంది రైతులు చనిపోయిండ్రు. NCRB రిపోర్ట్ ప్రకారం రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది 4వ స్థానం. 2019లో 419 మంది 2020లో 471 మంది రైతులు బలయ్యారు. ఇంకా లెక్క తీస్తే చాలా ఉంది. ‘వరి-ఉరి’ కామెంట్ తో 5 గురు రైతులు చనిపోయిండ్రు. ఇప్పుడు వడ్ల కుప్పపై 6 గురు రైతులు చనిపోయిండ్రు. కేసీఆర్ కు రైతులపట్ల ప్రేమ ఉంటే వాళ్లకు ముందుగా రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.' అని బండి సంజయ్ అన్నారు.   


Also Read:  నేరుగా కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు.. పక్కపక్కనే కూర్చొని కేసీఆర్-జగన్ ముచ్చట్లు






ట్రైబ్యునల్ జాప్యానికి సీఎం కేసీఆర్ కారణం


కరెంటు మీటర్లు బిగించి రైతులపై కేంద్రం భారం మోపుతుందని ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్.. ఎక్కడ భారం మోపిందో చూపించాలన్నారు బండి సంజయ్. కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవన్నారు. ఆయన పతనం ఆరంభమైందని, ఇక కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రైబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి సీఎం కేసీఆర్ కారణమని బండి సంజయ్ ఆరోపించారు.  సుప్రీంకోర్టులో కేసు వేసి ఏడేళ్లుగా నాన్చి కేంద్రానిదే బాధ్యత అనడం సిగ్గచేటన్నారు.  కృష్ణా పరివాహక ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా సీఎం కేసీఆర్ 299 టీఎంసీలను కేటాయించే ఒప్పంద పత్రాలపై అపెక్స్ కమిటీ సమావేశంలో సంతకం చేశారని ఆరోపించారు. ముందు తెలంగాణ వచ్చిన కొత్తలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సంగతేమైంందో తేల్చాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారో సర్వే చేయించారు కదా ముందు ఆ లెక్కలు బయటపెట్టాలన్నారు. దాని ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో లబ్ది కలిగించాలన్నారు.  


Also Read: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి