నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'అఖండ'. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ఇది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేలా ట్రైలర్ ఉంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలు ఉన్నాయి. అలాగే, అఘోరగా బాలకృష్ణను కొత్త గెటప్ లో కూడా చూపించారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా బావుందని ఇండస్ట్రీ టాక్. ఇక థియేటర్లలోకి సినిమా రావడమే తరువాయి. డిసెంబర్ 2 కోసం నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.