సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పోస్ట్ కొవిడ్ సమస్యలతో శనివారం అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కైకాల అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకుల్లో ఆందోనళ పెరిగింది. అయితే... కైకాలను ఫోనులో పలకరించానని, ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం తనకు కలిగిందని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.

"ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలియగానే... ఆయన్ను ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ను ఫోనులో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా... మళ్లీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగ చేసి, థాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డిగారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ... ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అని చిరంజీవి ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్, కైకాల సత్యనారాయణ, నవసర నటనా సార్వభౌమ హ్యాష్ టాగ్స్ జోడించారు.





చిరంజీవి ట్వీట్‌ కైకాల ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన తగ్గించిందని చెప్పాలి. అయితే... అపోలో ఆస్పత్రి వైద్యులు ఈ రోజు విడుదల చేసే హెల్త్ బులిటెన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్


Also Read:గ్యాప్ ఉంటే వచ్చేస్తాం.. 'బంగార్రాజు' విడుదలపై సుప్రియ కామెంట్స్..


Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..


Also Read: స‌ల్మాన్‌తో రాజ‌మౌళి మీటింగ్‌... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?


Also Read: బాలీవుడ్‌కు నాగ‌చైతన్య ప‌రిచ‌య‌మ‌య్యేది ఆ రోజే... లాల్ సింగ్ చ‌ద్దా కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!


Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి