‘బిగ్ బాస్ 5’ తెలుగు రసవత్తరంగా సాగుతోంది. శనివారం ప్రసారమైన 77వ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సిరి, షన్నులకు కన్ఫెషన్ రూమ్‌లో క్లాస్ పీకారు. ‘‘నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటున్నావా..? ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా..? ఎందుకు చేశావ్..? ఏం జరుగుతుంది..?’’ అంటూ నాగార్జున సిరిపై మండిపడ్డారు. ఇందుకు సిరి.. ‘‘ఏమో సార్.. నాక్కూడా క్లారిటీ లేదు’’ అని చెప్పింది. దీంతో ‘‘కోట్ల మంది నిన్ను చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అయ్యో ఇలా ఉండకూడదని అనుకోకూడదు కదా..’’ అని నాగ్ అన్నారు. ‘‘నా స్టోరీ నాకు తెలుసు.. బయట నేనేంటి అనేది నాకు తెలుసు. అయినా ఎందుకో కనెక్షన్ వస్తుంది. నాకు తెలియట్లేదు. ఇది తప్పా రైటా..? అని కూడా తెలియడం లేదు. తప్పు అని తెలిసినా నాకు అనిపించిందని చేస్తున్నా..’’ అని తెలిపింది. దీంతో నాగార్జున తల మీద కొట్టుకోవడం, బాదుకోవడం వంటి పనులు చేస్తే హౌస్ నుంచి పంపిచేస్తా అని సిరిని హెచ్చరించారు. ఆ తర్వాత షన్ముఖ్‌ను పిలిచి.. నువ్వు దీప్తిని అంతగా మిస్ అవుతుంటే.. ఈ క్షణమే వెళ్లిపో.. బిగ్ బాస్ గేట్స్ ఓపెన్‌గా ఉన్నాయి’’ అని అన్నారు. దీంతో షన్ను రేపటి నుంచి అలా జరగదని చెప్పడు. 


ఆ తర్వాత మానస్‌ను కూడా కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి.. ప్రియాంక గురించి తెలిపారు. ఆమె విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మనసులో మాటను చెప్పేయాలని తెలిపారు. నామినేషన్లలో ఉన్న ఏడుగురిలో సన్నీ, శ్రీరామచంద్ర సేఫ్ అయ్యారు. మిగతా సభ్యుల పరిస్థితి ఏమిటనేది ఈ రోజు ప్రసారం కానున్న 78వ ఎపిసోడ్‌లో తెలియనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆనీ మాస్టర్ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ విషయానికి వస్తే.. ‘సన్ డే.. ఫన్‌డే’ సందర్భంగా నాగ్ ఇంటి సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆదివారం విడుదలైన ప్రోమో ప్రకారం.. నాగ్.. ఇంటి సభ్యులు తమ తోటి సభ్యుడి గురించి అడిగిన సందేహాలను చదివి వినిపించారు. 


Also Read: షన్నుతో ఆ ఫీలింగ్‌ తప్పని తెలిసినా చేస్తున్నా.. ప్రియాంక వీడియో చూసి మానస్‌ షాక్


ముందుగా షన్నును ప్రశ్నిస్తూ.. టాస్క్ అనగానే సన్నీ వైపు చూస్తావ్.. అతడు మరీ అంత వైల్డా? అని నాగ్ ప్రశ్నించారు. మానస్‌ గురించి అడిగిన ప్రశ్నను చదువుతూ.. ‘‘మానస్.. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఎలా ఉంటుంది?’’ అని అడిగారు. దీనికి మానస్.. ‘‘ఫ్రెండ్స్‌గా ఉంటాం’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో సన్నీ ఆన్సర్ దొరికిందా అనగానే.. మీరు నా పేరు చెప్పందంటే చెప్పేశారు అని ఫన్నీగా అన్నాడు. ప్రియాంక ప్రశ్న చదువుతూ.. ‘‘నువ్వు మానస్ నుంచి ఏమి ఆశిస్తున్నావ్’’ అని అడిగారు. ఈ ప్రశ్న మానస్ అడిగాడు అని చెప్పగానే ప్రియాంక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆనీ మాస్టర్‌ను ప్రశ్నిస్తూ.. ‘‘నీ బుర్రను వంట చేసేప్పుడు, మేకప్ అయ్యేప్పుడు మాత్రమే వాడతావా?’’ అని అడిగారు. ఇందుకు ఆనీ లేదని సమాధానం చెప్పడంతో.. నాగ్ ‘‘బుర్రలేదా’’ అని పంచ్ విసిరారు. ఆ తర్వాత మరికొన్ని సరదా టాస్కులతో ప్రోమో ముగిసింది. చూస్తుంటే.. ఈ రోజు ప్రేక్షకులకు బోలెడంత వినోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


బిగ్ బాస్ 5 తెలుగు ఎపిసోడ్ 78 ప్రోమో: 






Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..


Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..


Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా.. జనాలతో ఆడుకోకండ్రా...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి