స్వరాజ్యం కోసం పోరాడిన తెలంగాణ యోధుడు కొమరం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో, ఊహాజనిత కథతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్రం కోసం రెండు పాత్రలు ఎలా పోరాటం చేశాయన్నది ఓ పాటలో చూపించనున్నట్టు తెలుస్తోంది. దానిని ఈ నెల 26న విడుదల చేయనున్నారు.
'ఆర్ఆర్ఆర్' నుంచి ఇప్పటి వరకూ రెండు పాటలను విడుదల చేశారు. ఒకటి... 'దోస్తీ' సాంగ్. ఇంకొకటి... 'నాటు నాటు'. ఇప్పుడు మూడో పాట రానుంది. 'జనని...' అంటూ సాగే ఆ పాట ఎలా ఉండబోతుందో ఈ నెల 26న తెలుస్తుంది. అందులో హీరోలు ఇద్దరితో పాటు అజయ్ దేవగణ్ కూడా కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి వారం ముందు... వచ్చే ఏడాది జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా శరన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read: బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ రోల్ అదే... ప్రిపేర్ అయ్యే టైమ్ కూడా లేదట!
Also Read: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ... తెలుగులో ఓ సినిమా, మాతృభాషలో మరో రెండు!
Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
Also Read: మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు! మా 'హల్క్'ను మేమే క్రియేట్ చేసుకున్నాం! - జాన్ అబ్రహం
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి