NTR: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?

'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా... యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు సినిమాలకు 'ఎస్' చెప్పారు. ఆ రెండూ ఎలా ఉండబోతున్నాయో ఆయన చెప్పారు.

Continues below advertisement
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయన 30వ సినిమా అది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. అలాగే, సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కూడా నెలకొంది. "కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే తాజా సినిమా రివెంజ్ డ్రామా" అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకు నిర్మాతలు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దాని గురించి ఎన్టీఆర్ మాట్లాడారు.
"ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా అక్టోబర్ 2022లో స్టార్ట్ అవుతుంది. అది 'కె.జి.యఫ్' రేంజ్‌లో ఉంటుంది" అని ఎన్టీఆర్ చెప్పారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న రెండు సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమాలు సైతం ఆ స్థాయిలో ఉండేలా చూసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.  ప్రస్తుతం ఈ హీరో ఫ్యామిలీతో యూరప్ హాలిడే ట్రిప్ లో ఉన్నారు.
 

Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
Also Read: 'భీమ్లా నాయక్' గురించి త్రివిక్రమ్ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Also Read: ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందా..? ప్రూఫ్ చూపిస్తోన్న నెటిజన్లు..
Also Read: బాలకృష్ణతో కామెడీ సినిమా చేయనంటున్నారు! ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు...
Also Read: జనని... 'ఆర్ఆర్ఆర్'లో మూడో పాట విడుదలయ్యేది ఎప్పుడంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Continues below advertisement