పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ, మనసులో ఒక మూల ఏదో భయం. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో? ఎన్నికష్టాలు పడతానో? అసలు నేను పెళ్లికి ఫిట్‌నా కాదా? సంసార సాగరాన్ని ఈదగలనా? ఇలా చాలా అనుమానాలు పెళ్లి వయసు యువతలో పెరిగిపోతున్నాయి. అందుకే మన చుట్టూ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. ఇలా పెళ్లంటే భయపడడాన్ని ‘గామోఫోబియా’ అంటారు. ఇది ఉన్న వాళ్లు ఒకరికి కమిటిమెంట్ ఇచ్చేందుకు చాలా భయపడతారు.
గామో ఫోబియాకు కారణం....
ఇదేమి వారసత్వంగా వచ్చేది కాదు. ఇంట్లో లేదా చుట్టుపక్కల కుటుంబాలలో భార్యాభర్తల గొడవలు, కుటుంబాన్ని పోషించలేక ఆ ఇంటి పెద్ద పడే కష్టాలు చూసి పుట్టుకొచ్చేదే. చిన్నప్పట్నించి నిత్యం గొడవలు జరిగే కుటుంబంలో పెరిగిన బిడ్డ పెద్దయ్యాక ఈ ఫోబియా బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ భయాన్ని ఒక మానసిక సమస్యగా చెప్పవచ్చు. ఈ ఫోబియా ఉన్న వాళ్లకి ఒకరితో అనుబంధం ఏర్పరచుకునేకన్నా, ఒంటరిగా బతకడమే మేలనిపిస్తుంది. అందుకే పెళ్లి పేరు ఎత్తితే చాలు భయపడతారు. వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ తమకున్న భయాలను మాత్రం బయటకు చెప్పుకోరు.
పెళ్లంటే భయపడేవారు ఇలా చేయండి
పెళ్లంటే భయమేస్తుందని బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది. దీనివల్ల సరైన వయసులో పెళ్లి కాకుండా ముదిరిపోతున్నారు. కాస్త ప్రయత్నిస్తే గామో ఫోబియా నుంచి బయటపడచ్చు. వైద్యుల వద్దకు కౌన్సిలింగ్ కు వెళితే చాలా మంచిది. అలాగే పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి.
1. ప్రపంచంలో పెళ్లి చేసుకోని వాళ్ల కన్నా, పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్యే ఎక్కువ. పెళ్లిని భారంగా కాకుండా ప్రకృతిలో, సృష్టిలో ఒక భాగంగా చూడండి.
2. పెళ్లి తరువాత చాలా మార్పులు జరిగిపోతాయని మీకు మీరే ఊహించుకోకండి. ఏదీ మారదు, భాగస్వామిని కలుపుకుపోతూనే మీకు నచ్చినట్టుగా మీరు జీవించేలా ప్లాన్ చేసుకోవచ్చు.
3. పెళ్లిని దూరం చేసుకుని, మీ వారసులను మీరు చూసుకునే అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు.
4. పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్న జంటల మధ్య రోజూ కొంతసేపు గడుపుతూ ఉండండి.
5. గామో ఫోబియాను మనసులోంచి తరిమికొట్టే థెరపీలు ఉన్నాయి. ఆ థెరపీలు చేయించుకుంటే సంసారసాగరాన్ని ఈదగలననే ధైర్యం పెరుగుతుంది.
Also read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also read: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...
Also Read : షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి