బర్త్ డే విషెష్ చెప్పడంలోనూ... టీజర్స్, ట్రైలర్స్ విడుదలైనప్పుడు వాటి గురించి స్పందించడంలోనూ నేచురల్ స్టార్ నాని స్టయిలే సపరేటు. అందులో కొంత హ్యూమర్, కొంత క్రియేటివిటీ ఉంటుంది. ప్రభాస్ బర్త్ డేకి 'నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాను ప్రభాస్ అన్నా. కానీ, చెప్పను' అని నాని ట్వీట్ చేశారు. 'రాధే శ్యామ్' టీజర్‌లో 'నాకు అన్నీ తెలుసు. కానీ, చెప్పను' అని ప్రభాస్ ఓ డైలాగ్ చెప్పారు కదా! నాని విషెస్ వెనుక రీజన్ అదన్నమాట. ఇక, ప్రస్తుతానికి వస్తే... ఈ రోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. ఆమెకు కూడా కొత్తగా విషెస్ చెప్పారు నేచురల్ స్టార్.
"మదర్ ఆఫ్ డ్రాగన్ (కుమారుడిని డ్రాగన్ గా పేర్కొన్నారు నాని)... పాండా (తనను తాను పాండాతో పోల్చుకున్నారు) వైఫ్... సెంటర్ ఆఫ్ అవర్ హోమ్ (మా ఇంటికి మూల స్తంభం)... హ్యాపీ బర్త్ డే అంజనా యలవర్తి. వుయ్ లవ్ యు" అని నాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంజనా యలవర్తికి, ఆయనకు మధ్య మొదలైన పరిచయం తొలుత స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటి అయిన సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు.
సినిమాలకు వస్తే... డిసెంబర్ 24న నాని తాజా సినిమా 'శ్యామ్ సింగ రాయ్' విడుదల కానున్న సంగతి తెలిసిందే. బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ పోషించారు. కొన్ని సన్నివేశాల్లో బెంగాల్ డైలాగులు కూడా చెప్పారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లు.
Also Read: ఇందిరా పార్క్‌లో ఆడుకోవడానికి వెళుతుంటే ఒకడు పక్కకి లాక్కుని...
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
Also Read: 'భీమ్లా నాయక్' గురించి త్రివిక్రమ్ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి