మనదేశంలో ఎంత మంది భర్తలకి తమ భార్యల పుట్టినరోజు గుర్తుంటుంది? ఆ రోజు కూడా చాలా ముఖ్యమైనదిగా ఎంతమంది పరిగణిస్తారు? ఓ సర్వే ప్రకారం మనదేశంలో భార్యల పుట్టినరోజులు గుర్తుంచుకునే భర్తల శాతం చాలా తక్కువ. కానీ ఓ అందమైన ఐలాండ్ దేశం సమోవా. అక్కడ కానీ భార్య పుట్టినరోజును మర్చిపోయినా, ఆ ప్రత్యేక దినానా విష్ చేయకపోయినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. అది చట్టపూరితమైన నేరం కిందకే వస్తుంది. భార్య తలచుకుంటే భర్తను ఆ క్షణమే జైల్లో కూడా పెట్టించగలదు. భార్యలను పట్టించుకోని భర్తలకు ఆ దేశం నరకమే.
చట్టం చెబుతోంది ఇదే
సమోవా చట్టం ప్రకారం... భర్త తన భార్య పుట్టినరోజును మరిచిపోయినా, కావాలనే విష్ చేయకపోయినా అది నేరం కిందకు వస్తుంది. దీనిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. భార్య అరెస్టు చేయమని కోరితే ఆ క్షణమే
భర్తను ఈడ్చుకువెళ్లి జైల్లో పడేస్తారు. ఆ రోజు భర్త జీవితం భార్య చేతుల్లోనే ఉంటుంది. ఆమె ఫిర్యాదు చేయనంతవరకు ఫర్వాలేదు. చేస్తే మాత్రం భర్త ఇబ్బందుల్లో పడ్డట్టే. అలాగే చట్టం భర్త తాను చేసినది తప్పని ఒప్పుకుని, సరిదిద్దుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. కాబట్టి కొంతమంది భర్తలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సమస్య నుంచి బయటపడుతున్నారు. కొంతమంది మొండి మొగుళ్లు మాత్రం తాము జైలుకైనా వెళ్తామని, భార్య పుట్టినరోజు మాత్రం గుర్తుపెట్టుకోమని వాదిస్తున్నారు.
మొదటిసారైతే ఫర్వాలేదు
తొలిసారి భార్య పుట్టినరోజు మర్చిపోతే, భార్య ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నామని, మళ్లీ పునరావృతం చేయవద్దని హెచ్చరిస్తారు. రెండోసారి నుంచి మాత్రం భార్య ఫిర్యాదు మేరకు నిర్ణయం తీసుకుంటారు. కాకపోత ఈ చట్టాన్ని తప్పుగా ఉపయోగిస్తున్న భార్యలు కూడా ఉన్నారు. భర్తపై పగతీర్చుకునేందుకు కొంతమంది ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారనే విమర్శలు అధికంగా ఉన్నాయి.
Also read: పెళ్లంటే భయపడుతున్నారా? అయితే మీకు ఈ ఫోబియా ఉన్నట్టే...
Also read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also read: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...
Also Read : షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు
Read Also: రోజూ గోడకుర్చీ వేయండి, గుంజీలు తీయండి... ఇవి చేస్తే చాలు ఆ సమస్యలు దూరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి