చిన్నప్పుడు గోడకుర్చీ, గుంజీలు అంటే ఒక పనిష్మెంట్. కానీ పెద్దయ్యాక మాత్రం అదో పెద్ద వరం. రోజూ అయిదు నిమిషాల పాటూ గోడ కుర్చీ వేస్తే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కండరాల నుంచి గుండె వరకు ఎన్నో అవయవాలకు ఈ వ్యాయామం మేలు చేస్తుంది. గోడకుర్చీ వేయడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం. 


1. మానసిక ఆందోళనలు మనిషిగి కుంగదీస్తాయి. అవి దరిచేరకుండా ఉండాలంటే మంచి వ్యాయామం గోడకుర్చీ. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. 
2. పొట్ట దగ్గర కొవ్వుచేరి ఎబ్బెట్టుగా కనిపిస్తున్న వాళ్లకి కూడా ఇది మేలు చేస్తుంది. రోజూ అయిదు నిమిషాల పాటూ చేయడం అలవాటు చేసుకుంటే పొట్ట వద్ద ఉన్న కొవ్వు కరుగుతుంది. పొట్ట  దగ్గరి కండరాలు కూడా దృఢంగా మారుతాయి. 
3. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది. గోడకుర్చీ వేయడం వల్ల చాలా క్యాలరీలు ఖర్చువుతాయి. తద్వారా బరువు తగ్గుతారు. 
4. గుండె సంబంధ వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది. 
5. వెన్ను నొప్పితో బాధపడేవారికి ఈ వ్యాయామం మంచిది. వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచడంలో గోడకుర్చీ ఎంతో సాయపడుతుంది. కండరాలను దృఢంగా చేస్తుంది. గుంజీలు తీయడం వల్ల  శరీరం కింది భాగంలోని కండరాలు దృఢంగా మారుతాయి. రోజూ ఉదయాన 15 సార్లు గుంజీలు తీయాలి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.