శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గత కొన్ని నెలల నుంచే వార్తల్లో ఉంది. దీనికి సంబంధించిన రెండర్లు కూడా కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిజైన్ అందించనున్నారు. ఇందులో 4జీ, 5జీ వేరియంట్లు ఉండనున్నాయి. నాలుగు కలర్ ఆప్షన్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. SM-A136U, SM-A136U1, SM-A136W, SM-S136DL మోడల్ నంబర్లతో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది.


అయితే ఈ వెబ్‌సైట్‌లో ఫోన్ స్పెసిఫికేషన్లు కనిపించలేదు. అయితే గతంలోనే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ధర 249 డాలర్లుగా(సుమారు రూ.18,400) ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనదేశంలో మాత్రం రూ.15 వేలలోపే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.48 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించనున్నట్లు సమాచారం.


గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ రెండర్లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. గెలాక్సీ ఏ12 కంటే ఇందులో కాస్త కొత్త డిజైన్ ఉండనుంది. గెలాక్సీ ఏ12 మనదేశంలో 2020లో లాంచ్ అయింది. బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌లో కూడా దీనికి సంబంధించిన 4జీ వేరియంట్ అందుబాటులో ఉండనుంది.


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి