మేషం
ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రమాదకర పనులు చేయవద్దు.  మీ బాధ్యతను జాగ్రత్తగా పూర్తి చేయండి. అన్నింటా విజయం వరిస్తుంది.  వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు.  నిరుద్యోగులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. 
వృషభం
కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. అనవసర ఖర్చులు ఉంటాయి. రోజు రొటీన్ గానే ఉంటుంది.  ప్రయాణాలు, పెట్టుబడులు, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. విద్యార్థులకు శుభసమయం.
మిథునం
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. సామాజిక రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బాధ్యతను నెరవేర్చడంలో ఆనందం ఉంటుంది. తెలివితేటలు, మనోబలంతో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. వ్యాపారంలో పని విస్తరణ ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.
Also Read:  కౌగిలింతల్లో ఈ రాశుల వారికి ఫుల్ మార్క్స్
కర్కాటకం
ఇంటికి అతిథులు వస్తారు, ఖర్చులు పెరుగుతాయి. మంచి సమాచారం అందుతుంది. సంతోషంగా ఉంటారు. న్యాయపరమైన అంశాలు పరిష్కారమవుతాయి. తొందరపడకండి. ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండండి. శక్తి పెరుగుతుంది. కుటుంబంలో సహకార వాతావరణం ఉంటుంది. అనుకున్న పని పూర్తిచేస్తారు.  ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
సింహం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఆందోళన అలాగే ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు మరింత భావోద్వేగానికి లోనవుతారు. ప్రేమ వ్యవహారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ ప్రయత్నాల్లో విజయం సాధించలేరు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. 
కన్య
మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయొచ్చు. పెట్టుబడులు కలిసొస్తాయి. ఏదైనా పెద్ద పని చేయడంలో ఆనందం ఉంటుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుంచి ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. శ్రమకు తగ్గా ఫలితం ఉంటుంది. విలువైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
తుల
ఈరోజు మీరు ప్రయాణం చేయవచ్చు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మాటని  అదుపులో ఉంచుకోండి. కొత్త ఖర్చులు పెరుగుతాయి. అప్పు తీసుకోవలసి రావొచ్చు, రిస్క్ తీసుకోకండి. అపరిచితుడిని నమ్మవద్దు. సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి. 
వృశ్చికం
వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక స్థితి  బావుంటుంది. సోమరితనం వద్దు సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నాయకత్వ లక్షణాల వల్ల తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కోర్టు పనులు పూర్తవుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు బాధల నుండి ఉపశమనం పొందుతారు. 
ధనుస్సు
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరికీ సలహా ఇవ్వకండి. కొత్త పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త ప్రణాళిక రూపొందిస్తారు.  కార్యాలయంలో మార్పులు జరగొచ్చు. కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి.
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
మకరం
మాటను అదుపులో పెట్టుకోవాలి. మీ చాకచక్యంతో అందరి మెప్పు పొందుతారు.  తెలియని అడ్డంకులు అధిగమిస్తారు. పిల్లల సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆహారంపై నియంత్రణ తీసుకోండి. కొత్త ఒప్పందాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.  డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. బ్యాంకు-బీమా సంబంధిత పనులు పూర్తవుతాయి.
కుంభం
ఈరోజు అద్భుతంగా  ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులతో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.  కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. లావాదేవీలలో జాగ్రత్త. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. బంధువులను కలుస్తారు.
మీనం
విహారయాత్రకు వెళతారు. మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. పెట్టుబడులు పెరుగుతాయి. ఆర్భాటపు ప్రచారానికి దూరంగా ఉండండి. సృజనాత్మక పని విజయవంతమవుతుంది. ఏదైనా  కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: యమలోకంలో మొదట పడే శిక్ష ఇదే.. తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి