కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని చెబతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలాతోరణ దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని పండితులు వివరిస్తుంటారు.
జ్వాలాతోరణం
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాల వెలిగిస్తారు. ఆ మంట కిందనుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు.
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
ఎందుకంటే...
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఓ కారణం వుంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ అగ్నితోరణం గుండా లోనికి వెళతారట. అంటే పాపాత్ములకు వేసే మొదటి శిక్ష ఇది. అందుకే అసలు యమలోకంలోకి అడుగుపెట్టకుండా ఉండాలన్నా, ఈ శిక్షల నుంచి తప్పించుకోవాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలని చెబుతారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని..యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదని చెబుతారు. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి మోసినా, వెనుక నడుస్తూ అయినా పరమేశ్వరా నేను ఇప్పటి వరకూ చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి..మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో నడిపించమని, నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం పూర్తైన వెంటనే పూర్తిగా కాలకుండా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడతారు. ఇది ఉన్నచోట నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతారు.
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read:కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: ఈ రాశులవారికి మంచిరోజులొచ్చాయి.. మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి