మేషరాశి
ఆస్తికి సంబంధించిన విషయాల్లో అడుగు ముందుకుపడుతుంది. ఉద్యోగ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈరోజు దాదాపు మీ పనులన్నీ పూర్తవుతాయి.  వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
వృషభం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. గాయపడే  ప్రమాదం ఉంది.  ఎలాంటి కారణం లేకుండా ఏదో ఆందోళనలో ఉంటారు. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకుని ఉంటే వాయిదా వేయడం మంచిది.  బంధువులను కలుస్తారు. రిస్క్ తీసుకోవద్దు. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. 
మిథునం
ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల మక్కువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. టెన్షన్ తగ్గుతుంది. 
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
కర్కాటకం
కార్యాలయంలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. కుటుంబంలో కొన్ని ఆందోళనలు అలాగే ఉంటాయి. ధనలాభం పొందే అవకాశాలు ఉంటాయి. శుభవార్త వింటారు.
సింహం
స్నేహితులను కలుస్తారు. అనవసరమైన విషయాలపై ఎక్కువ దృష్టి సారించవద్దు.  ఇంటి విషయాల్లో టెన్షన్ ఉంటుంది. ఉద్యోగులకు  బదిలీ జరిగే అవకాశం ఉంది. ఈరోజంతా ఆనందంగా ఉంటారు.  ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. 
కన్య
వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆర్థిక ఒత్తిడి దూరమవుతుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. బంధువుల నుంచి అననుకూల సమాచారం అందుతుంది. తెలియని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. ఎప్పటినుంచో చేతికందాల్సిన  ఆగిపోయిన మొత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మతపరమైన ప్రయాణం చేయవచ్చు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
తుల
ఈ రాశి  ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఇంటా-బయటా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.పాత మిత్రులను కలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బలహీనులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం
ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.  స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.  నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు.
ధనుస్సు
వ్యాపారం బాగానే ఉంటుంది. అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా  ఉంటారు. ఆకస్మిక లాభం ఉంటుంది. స్నేహితుడిని కలుస్తారు. మాటల మీద సంయమనం పాటించండి. 
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
మకరం
గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల విషయంలో రిస్క్ చేయవద్దు.  ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇరుగుపొరుగు వాతావరణం బాగుంటుంది. కొత్త పనుల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. స్నేహితునితో సమావేశం చాలా ఉపయోగపడుతుంది. 
కుంభం
మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు తలపెట్టే పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక పనిని పూర్తి చేయడంలో విఫలమవడంతో నిరాశ చెందుతారు. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
మీనం
మీన రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం అంతంతమాత్రంగా సాగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు పొందుతారు. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.
Also Read: కౌగిలింతల్లో ఈ రాశుల వారికి ఫుల్ మార్క్స్
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి