ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్ మరో ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. హనమకొండలో ప్యారడైజ్ శాఖను ఏర్పాటు చేసింది. ప్రసిద్ధ చారిత్రక నగరంలో ఇప్పుడు ఓమ్నీ ఛానెల్ రెస్టారెంట్ సైతం ఓ దర్శనీయ కేంద్రంగా మారిపోయనుంది. వేయి స్తంభాల గుడితో పాటు వరంగల్, హనుమకొండలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు సందర్శకులు విపరీతంగా వస్తుంటారు. వారికి హైదరాబాదీ బిర్యానీ రుచులను అందించేందుకు నూతన ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు.
అత్యుత్తమ బిర్యానీ, కబాబ్స్ సహా మరెన్నో పదార్థాలను ఇప్పుడు పర్యాటకులు ఆస్వాదించవచ్చు. అసాధారణ నాణ్యత, పరిశుభ్రతతో అతి జాగ్రత్తగా ప్రస్తుత కాలంలో అవసరమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్యారడైజ్‌ను డిజైన్ చేశారు. శాస్త్రినగర్ మెయిన్ రోడ్, సుబేదారి, హనుమకొండ వద్ద 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
‘‘హనుమకొండలో నూతన ఔట్‌లెట్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, తరచూ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సందర్శకులు ఇక్కడి వస్తుండటంతో ప్యారడైజ్‌ను ఆరంభించాం. ఆహార ప్రియులు ఇక హనమకొండలోనే తమ అభిమాన బిర్యానీని ఆస్వాదించొచ్చు. వెయ్యి స్తంభాల గుడి ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. వారికి వైభవం, రుచికరమైన విందు సమ్మేళనంగా ప్యారడైజ్ నిలుస్తుంది' అని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ ఛైర్మన్ అలీ హేమతి అన్నారు.
‘‘భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆహార కేంద్రాలలో ఒకటిగా, మా విస్తరణ ప్రణాళికలో భాగంగా, హనమకొండ మా 43 వ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి అత్యుత్తమ ఎంపికగా నిలిచింది. అంతేకాదు, ఇది తెలంగాణాలో భాగం. అందువల్ల నిజామీ వారసత్వం, కాకతీయుల వైభవపు సమ్మేళనంగా ఇది ఉంటుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆహారాన్ని మేం అందిస్తాం’’ అని ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శ్రీ గౌతమ్ గుప్తా అన్నారు.
ప్యారడైజ్ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్ స్పూన్ అవార్డు ను ఇండియా ఫుడ్ ఫోరమ్ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్, జీహెచ్‌ఎంసీ, టైమ్స్ ఫుడ్ అవార్డ్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణా, లైఫ్‌టైమ్ అావ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.
Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: EPFO New Update: జాబ్ మారారా? పీఎఫ్ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!
Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ
Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ పతనానికి కారణాలివే..!
Also Read: Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..