భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఏప్రిల్ తర్వాత దలాల్ బజార్లో ఇదే అతిఘోరమైన పతనం! సోమవారం ఒక్కరోజే మదుపర్ల సంపద రూ.7.86 లక్షల కోట్లు ఆవిరైంది. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం పీఎస్‌యూ స్టాక్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక ఓ2సీ వ్యాపారానికి సంబంధించిన ఒప్పందంలో అరామ్‌కో భాగస్వామ్యాన్ని పునరాలోచిస్తామని చెప్పడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పడిపోయాయి. పేటీఎం షేరు ధర పడిపోవడం, ద్రవ్యోల్బణం పరమైన సమాచారం మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్‌ను పెంచింది.
లాక్‌డౌన్లు
విదేశాల్లో తిరిగి కొవిడ్-19 లాక్‌డౌన్లు పెడుతున్నారు. త్వరలోనే తాము లాక్‌డౌన్ విధిస్తామని ఆస్ట్రియా తెలిపింది. ఫిబ్రవరి నుంచి వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేస్తామని ప్రకటించింది. జర్మనీ, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్, బెల్జియం సైతం కొవిడ్ ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా కొన్ని కంపెనీల ఎగుమతులపై ప్రభావం పడనుంది.
వడ్డీరేట్ల భయం
ఊహించిన దానికన్నా ముందే వడ్డీరేట్ల పెంపు అందరినీ భయపెడుతోంది. ఐరోపా సెంట్రల్ బ్యాంకు రేట్ల పెంపు గురించి ఆలోచిస్తున్నట్టు బుందెస్‌బ్యాంక్ అధ్యక్షుడు జెన్స్ వీడ్‌మన్ తెలిపారు. కొన్నిరోజులు పాటు ద్రవ్యోల్బణం రెండు శాతానికి పైగానే ఉంటుందని వెల్లడించారు.
క్రూడ్ కష్టాలు
ముడి చమురు నష్టాలు మరో కారణం. ధరలు పెరగకుండా అడ్డుకొనేందుకు అమెరికా వంటిదేశాలు రిజర్వులను ఉపయోగిస్తున్నాయి. ఇదీ ద్రవ్యోల్బణానికి ఓ కారణం అవుతోంది.
దిద్దుబాటు దశ
ప్రస్తుతం మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ పోర్టుఫోలియో నిర్మించుకొనేందుకు ప్రస్తుత కన్సాలిడేషన్ ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఎక్కువ విలువ పెరిగిన స్టాకుల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమూ నష్టాలకు ఓ కారణమే.
Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్ ఇది!
Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్ సూపర్ హిట్టవుతుందా?
Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి