కస్టమర్ల డబ్బుకు మరింత రక్షణ కల్పించేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది! ఏటీఎం కార్డు మోసాలకు చెక్‌ పెట్టేందుకు సరికొత్త సాంకేతికతను అమల్లోకి తీసుకొచ్చింది. ఓటీపీ ద్వారా మరింత భద్రత కల్పిస్తోంది. పదివేల రూపాయాలకు పైబడే లావాదేవీలు చేసేటప్పుడు మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీనివల్ల ఇతరులు మీ కార్డును ఉపయోగించలేరు.


'ఎస్‌బీఐ ఏటీఎంల్లో చేసే ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ మోసగాళ్ల నుంచి మీకు వ్యాక్సినేషన్‌ రక్షణ లాంటిది. మిమ్మల్ని మోసాల నుంచి రక్షించడం మాకు అత్యంత కీలకమైన బాధ్యత' అని ఎస్‌బీఐ ఈ మధ్యే ట్వీట్‌ చేసింది. చిన్న వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ ఓటీపీ ఆధారిత మెకానిజం రూ.10వేల కన్నా ఎక్కువ విలువైన లావాదేవీలకే వర్తిస్తుంది. డెబిట్‌ కార్డును ఏటీఎంలో పెట్టిన తర్వాత మీ నమోదిత మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుందని బ్యాంకు తెలిపింది.


టెక్నాలజీ పెరిగిన తర్వాత మోసగాళ్లు తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. మన కార్డు మనవద్దే ఉన్నా ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ-కైవైసీ పేరుతో వివరాలు రాబట్టి వాటిద్వారా లక్షల రూపాయాలను కొల్లగొడుతున్నారు. అందుకే వినియోగదారుల డబ్బులకు రక్షణగా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఏటీఎం, బ్యాంకు, ఇతర ఆర్థిక వివరాలను ఎవరికీ చెప్పొద్దని సూచిస్తున్నాయి. అందులో భాగంగానే ఏటీఎం వినియోగానికి ఎస్‌బీఐ ఓటీపీని ప్రవేశపెట్టింది.


 






Also Read: EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!


Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!


Also Read: Kerala Tea-Seller & Globetrotter : 26 దేశాలు తిరిగొచ్చిన ఈ టీ కొట్టు దంపతుల్లో భర్త మృతి.. ఆనంద్‌ మహీంద్రా నివాళి


Also Read: Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!


Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి