టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ హుందాతనాన్ని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. ఎంత ఎదిగినా ఒదిగివుండే అతడి తత్వం అభినందనీయం అని పేర్కొన్నాడు. జట్టు విజయాలను ప్రజలు కీర్తించాలి కానీ కోచ్ కాదని వెల్లడించాడు. తమదే అత్యుత్తమ భారత జట్టని రవిశాస్త్రి చెప్పడాన్ని విమర్శించాడు. న్యూజిలాండ్ విజయం తర్వాత ద్రవిడ్ మాట్లాడిన తీరు ఆకట్టుకుందని పేర్కొన్నాడు.
'మనం నేలమీదే ఉండాలి. వాస్తవంలో బతకాలి. ఎందుకంటే రాబోయే 12 నెలల్లో భారీ టోర్నీలు ఉన్నాయి' అని న్యూజిలాండ్ విజయం తర్వాత ద్రవిడ్ అన్నాడు. 'న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడి మరో మూడు రోజుల్లోనే సిరీసుకు వచ్చేసింది. కేవలం ఆరు రోజుల్లో మూడు మ్యాచులు ఆడింది. ఇదేమంత సులభం కాదు' అని పేర్కొన్నాడు.
ద్రవిడ్ మాటలను గంభీర్ ప్రశంసించాడు. 'ఒక విషయం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. జట్టు గెలిస్తే మనల్ని మనమే పొగుడుకోవద్దు. బయటవాళ్లు పొగిడితే తప్పులేదు. మేం 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు మాదే అత్యుత్తమ జట్టని భారీ ప్రకటనలు చేయలేదు. దేశమే కీర్తించింది. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను, ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం గొప్ప విషయాలే. అందులో డౌటేం లేదు. కానీ మనం భారీ ప్రకటనలు చేయకూడదు. ఇలాంటివి రాహుల్ ద్రవిడ్ నుంచి వినిపించవు. గెలిచినా ఓడినా సమతూకంగా మాట్లాడతాడు' అని గౌతీ అన్నాడు.
Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్ ఇది!
Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్ సూపర్ హిట్టవుతుందా?
Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!
Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్ ఛాపెల్..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి