మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి అమరావతి రైతులు నమ్మడం లేదు. ప్రభుత్వం మళ్లీ ఏదో తిరకాసు పెడుతుందని నమ్ముతున్నారు. అందుకే  పాదయాత్రలో ఉన్న రైతులు తాము వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని..  700 రోజులుగా ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టిందన్నారు. ఏడు వందల రోజులుగా ఇబ్బందులు పడ్డాం...  తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదని జేఏసీ నేతలు గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేశారన్నారు. 


Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !


తాము చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వస్తోందని.. చివరికి ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే వెనక్కి తగ్గారని రైతులు భావిస్తున్నారు. ఒక వేళ నిర్ణయం వెనక్కి తీసుకున్నా అమరావతిని అభివృద్ది చేస్తారన్న నమ్మకం లేదన్నారు.  బిల్లులు వెనక్కి తీసుకోవడం కుట్రలో భాగమేనని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మలేమని.. న్యాయస్థానాల నుంచతి భరోసా రావాల్సి ఉందన్నారు. మహాపాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు. తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత డిసెంబర్ 17వ తేదీన పాదయాత్ర ముగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. 


Also Read: సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?


రాజధాని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందాలేదా అన్న విషయంలో  ఎక్కువ మంది ప్రభుత్వాన్ని నమ్మడంలేదు. ప్రభుత్వానికి రో వ్యూహం ఉందని భాిస్తున్నారు.  ఆ వ్యూహం ఏమిటో స్పష్టత లేదు ఇప్పటి వరకూ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా స్పష్టమయింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలని.. రైతుల పోరాటాన్ని అంగీకరించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతుల పోరాటాన్ని అభినందిస్తున్నారు.  ప్రభుత్వం మరో విధంగా ముందుకు వస్తుందని.. కొంత మంది అనుకోవడం లేదు. 


Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?


అమరావతికి బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిచించిన తరుణంలో...  జనగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని... మరో రకంగా కుట్రలు చేయకపోవచ్చునని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


Also Read : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి