బాగా చూసుకోవానుకొన్నాడు.. రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాడు.. తాను తన భార్య సుఖంగా జీవించాలనుకొన్నాడు.. కానీ ఆ భార్య చేసిన పనితో డీలా పడ్డాడు. రోజూ ఆటో తోలితే తప్ప రెక్కాడని పరిస్థితి అతనిది. తన భార్య, తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవళ్ళు శ్రమించి ఆటో తోలుతూ ఉన్నదానిలోనే తన కాపురం సాగేలా చూసుకొంటూ వస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. 


కదిరి మండలం పట్నం గ్రామంలో శివ శంకర్, హేమలత అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రోజూ ఆటో తోలూతూ తన కుటుంబానికి ఆదాయాన్నిచ్చేవాడు. కానీ, అతని భార్య భర్తను మోసం చేసేందకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో విషయం తెలుసుకొన్న భర్త శివశంకర్ తన భార్యను ప్రవర్తన మార్చుకోమంటూ పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ ఇవేమీ పట్టని భార్య తన అక్రమ సంబంధం కొనసాగిస్తూనే వచ్చింది. ఎంతలా అంటే తన ప్రియుడు రామాంజనేయులుతో తన ఇంట్లోనే తన బందాన్ని కొనసాగించింది. 


రెండు రోజుల క్రితం తన ఇంట్లో తన ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ ఇద్దరూ భర్త శివ శంకర్ కంట పడ్డారు. తన ఇంట్లో మంచంపై భార్య వేరే ఇంకొకరితో ఉండడాన్ని చూసి తట్టుకోలేక భార్య తలపై రోకలి బండతో మోది చంపాడు. చాలాసార్లు చెప్పి చూశానని, అయినా ఏమాత్రం పట్టించుకోలేదని భర్త తెలిపాడు. తనను మోసం చేస్తూ వచ్చిన భార్య హేమలతను చంపేసినట్లు తన మామకి చెప్పి శివశంకర్ పోలీసులకు లొంగిపోయాడు. ఫలితంగా తన పిల్లలిద్దరూ ఆనాథలైపోయారు.


భర్త తెచ్చే డబ్బుతో సుఖంగా తన సంసారాన్ని చూసుకోవాల్సిన భార్య తన క్షణిక సుఖం కోసం తన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తన పిల్లలిద్దరిని ఆనాథలను చేసిందంటూ బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అప్పటికీ బంధువులు, అనేకమార్లు చెప్తున్నప్పటికి ఏమాత్రం తన ప్రవర్తన మార్చుకోకుండా భర్త శివశంకర్‌ను భార్య అనేకవిధాలుగా ముప్పుతిప్పలు పెట్టిందంటూ వాపోయారు. 


పోలీసుల అదుపులో ప్రియుడు
ప్రియుడు రామాంజినేయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అనేకమార్లు హెచ్చరించినప్పటికి ఫలితం లేకపోవడంతోనే ఈ పని చేయాల్సివచ్చిందంటూ పోలీసులతో శివశంకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక తన పిల్లలకు దిక్కెవరని విలపించాడు.


Also Read: Acid Attack: ఇద్దరు పిల్లలున్నా వింత కోరిక.. కాదన్నాడని ప్రియుడిపై యాసిడ్ పోసేసిన మహిళ..


Also Read: Nalgonda Mystery: గదిలో నుంచి పాడు వాసన.. తలుపులు తెరిచి చూసి ఇంటి ఓనర్ షాక్!


Also Read: Kurnool: కార్తీక దీపాలు వదిలేందుకు వెళ్లి భార్యాభర్తల మృతి... మరో ప్రమాదంలో నలుగురు మహిళలు గల్లంతు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి