న్యూజిలాండ్ జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో వైట్ వాష్ చేసింది. మూడో టీ20 మ్యాచ్‌లో ఏకంగా 73 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఏకపక్షంగా భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 111 పరుగులకే ఆలౌట్ అయింది.
మధ్యలో తడబడినా భారీస్కోరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఈ మ్యాచ్‌కు జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్, అశ్విన్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (29: 21 బంతుల్లో, ఆరు ఫోర్లు), రోహిత్ శర్మ (56: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిషెల్ శాంట్నర్ భారత్‌ను భారీ దెబ్బ కొట్టాడు. తన మొదటి ఓవర్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను (0: 4 బంతుల్లో) అవుట్ చేయడంతో పాటు.. రెండో ఓవర్‌లో రిషబ్ పంత్‌ను (4: 6 బంతుల్లో) కూడా అవుట్ చేయడంతో భారత్ బ్యాటింగ్ వేగం నెమ్మదించింది. 10 ఓవర్లలో జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులకు చేరుకుంది.
ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవుటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (25: 20 బంతుల్లో, రెండు ఫోర్లు), వెంకటేష్ అయ్యర్ (20: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరూ కూడా అవుటవ్వడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది.
ఈ దశలో హర్షల్ పటేల్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), దీపక్ చాహర్ (21 నాటౌట్: 8 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ మూడు వికెట్లు తీయగా.. లోకి ఫెర్గూసన్, ఇష్ సోధి, ఆడం మిల్నే, ట్రెంట్ బౌల్ట్‌లకు తలో వికెట్ దక్కింది.
అదరగొట్టిన బౌలర్లు
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి న్యూజిలాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశలో సాగలేదు. మార్టిన్ గుప్టిల్ (51: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మినహా.. ఇంకా ఎవరూ 20 పరుగులు కూడా దాటలేదు. మొత్తం జట్టులో ముగ్గురు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 73 పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. వెంకటేష్ అయ్యర్, చాహల్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు.
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి