నటిగా తమిళ, మలయాళ భాషల్లో చాలా సినిమాలే చేసింది లిజోమోల్ జోస్. కానీ 'జై భీమ్' సినిమా ఆమెకి భారీ పాపులారిటీ దక్కింది. సినతల్లి క్యారెక్టర్ లో లిజోమోల్ జీవించేసింది. ఇందులో ఆమె గిరిజన మహిళగా, గర్భవతిగా తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించేసింది. తెరపై ఆ పాత్రలో ఇమిడిపోవడానికి ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశానని చెబుతోంది లిజోమోల్. 


Also Read: విజయ్ దేవరకొండతో అనన్య పాండే హార్స్ రైడింగ్..


షూటింగ్ కి ముందు ప్రతిరోజూ గిరిజనుల గుడిసెలకు వెళ్లేదాన్ని అని.. అక్కడ వాళ్లు చేసే పని నేర్చుకొని వాళ్లతో కలిసి పని చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పులు వేసుకోరని.. పగలు,రాత్రి అనే తేడా లేకుండా వేటకు వెళ్తారని.. అవన్నీ తాను కూడా చేశానని చెబుతోంది ఈ బ్లాక్ బ్యూటీ. సినిమాలో పాము కాటుకు మందులు ఇచ్చే క్యారెక్టర్ లో నటించానని.. పాత్ర కోసం నిజంగానే ఆ వైద్యం నేర్చుకున్నానని వెల్లడించింది. 


అలానే వాళ్లు ఎలుకలను వేటాడి వండుకొని తింటారని.. ఏవి పడితే అవి కాకుండా పొలాల్లో దొరికేవే తినేవారని చెప్పింది. వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసేవన్నీ చేయాలనుకున్నానని.. అందుకే ఎలుక కూర తిన్నానని తన అనుభవాలు వెల్లడించింది. తనకైతే ఎలుక మాంసం చికెన్ లా అనిపించిందని.. ఈ విషయాన్ని తన ఇంట్లో చెబితే.. నువ్ ఎలుక కూర తిన్నావా..? అని వారు ఆశ్చర్యపోయారని గుర్తు చేసుకుంది. అయితే ఆ కూర తినడం తప్పేం కాదని.. వాళ్లు తింటున్నప్పుడు మనమెందుకు తినకూడదని చెప్పడంతో.. అప్పటినుంచి వారు ఆ టాపిక్ మళ్లీ తీసుకురాలేదని చెప్పుకొచ్చింది. ఇక 'జై భీమ్' తరువాత నటిగా లిజోమోల్ కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయినట్లు తెలుస్తోంది. 


Also Read:ప్లాన్ మార్చేసిన 'విరాటపర్వం'.. ఓటీటీ డీల్ క్యాన్సిల్..


Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?


Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..


Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్


Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?


Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి