Bigg Boss 5 Telugu: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

మొదటి ప్రోమోలో హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించిన నాగార్జున.. లేటెస్ట్ ప్రోమోలో మాత్రం వాళ్లను టెన్షన్ పెట్టేశాడు. 

Continues below advertisement

బిగ్ బాస్ సీజన్ 5 పదకొండు వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎనిమిది నామినేషన్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీరామ్, సన్నీలు సేవ్ అయినట్లుగా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదలయ్యాయి. మొదటి ప్రోమోలో హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించిన నాగార్జున.. లేటెస్ట్ ప్రోమోలో మాత్రం వాళ్లను టెన్షన్ పెట్టేశాడు. 

Continues below advertisement

Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..

ముందుగా బిగ్ బాస్ స్టేజ్ పైకి 'అనుభవించు రాజా' సినిమా టీమ్ వచ్చింది. హీరో రాజ్ తరుణ్ ను చూసి బాగా ఎగ్జైట్ అయ్యింది సిరి. రాజ్ అంటూ గట్టిగా అరిచింది. 'ఏంటి సిరి విశాఖపట్టణం' కనెక్షనా..?' అని అడిగారు నాగార్జున. ఆ తరువాత రాజ్ తరుణ్ 'హే సిరి సంబంధాలు చూస్తున్నాం' అని అనగా.. దానికి సిరి సిగ్గుపడింది. వెంటనే రాజ్ తరుణ్ 'నీకు కాదు..' అంటూ ఆటపట్టించాడు. 

ఆ తరువాత హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఒక్కో కంటెస్టెంట్ కి వేరే హౌస్ మేట్స్ పేర్లు ఇచ్చి.. బోర్డు మీద వాళ్ల గురించి డ్రాయింగ్ గీస్తే.. మిగిలిన వాళ్లు గెస్ చేయాలి. సన్నీ ఫైర్ గురించి కమెడియన్ సుదర్శన్ పంచ్ లు వేయగా.. నవ్వేశాడు సన్నీ. ఆ తరువాత ప్రియాంక బోర్డు మీద ఏవో పిచ్చిగీతలు వేయగా.. అది శ్రీరామ్ అని కరెక్ట్ గా గెస్ చేశాడు మానస్. వెంటనే నాగార్జున.. 'ప్రియాంక పిచ్చిగీతలను అర్ధం చేసుకున్న మానస్' అంటూ కామెంట్ చేశారు. ఫైనల్ గా నామినేషన్ లో ఉన్న యానీ మాస్టర్, ప్రియాంకలను చివరివరకు ఉంచి వాళ్లకు అడుగుల టాస్క్ ఒకటి ఇచ్చారు. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారో..!

Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?

Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్

Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి

Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్

Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement