కరోనా కారణంగా చాలా సినిమాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. కొన్ని సినిమాలు షూటింగ్ మొదలుకాకుండా మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నా.. రిలీజ్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసేసి.. ఓటీటీలో విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు అసలు ఓటీటీలో విడుదల చేయాలా..? లేక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూడాలా అనే విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూషన్ లో ఉన్నాయి. అందులో 'విరాటపర్వం' సినిమా ఒకటి.
Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ఇప్పుడు సెకండ్ వేవ్ అయిపోయింది. సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ 'విరాటపర్వం' సినిమా విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుందని.. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ నెలలు గడుతున్నా.. రిలీజ్ సంగతి చెప్పడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 'విరాటపర్వం' సినిమాకి సంబంధించి ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేశారట. ఈ సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మీడియాకు లీక్స్ కూడా అందుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. జనవరి నెలాఖరున లేదంటే ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?
Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి