యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నదే తమ ప్రణాళిక అని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉండేలా ప్రయత్నించామని పేర్కొన్నాడు. ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసమే తాము కృషి చేస్తున్నామని తెలిపాడు. న్యూజిలాండ్‌పై సిరీసు విజయం తర్వాత అతడు మాట్లాడాడు.
'వీలైనంత ఎక్కువగా వెంకటేశ్ అయ్యర్‌కు జట్టులో చోటిస్తాం' అని రోహిత్ అన్నాడు. 'అదే సమయంలో అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో మేం స్పష్టంగా చెప్పాలి. సాధారణంగా అతడు ఫ్రాంచైజీ క్రికెట్లో ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇక్కడలాంటి అవకాశం లేదు కాబట్టి కాస్త కష్టమే! 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ ఇస్తున్నాం' అని రోహిత్ తెలిపాడు.
'మూడో మ్యాచులో వెంకటేశ్ ఆత్మవిశ్వాసంతో స్థిరంగా కనిపించాడు. స్పష్టమైన ఆలోచనా ధోరణితో ఉన్నాడు. అతడి బౌలింగ్ ప్రతిభను మీరు చూశారు. భవిష్యత్తులో అతడు కీలకం అవుతాడు. అతడు బౌలింగ్‌పై ఆత్మవిశ్వాసం పెంచుకొనేలా చేయడమే మా ముందున్న లక్ష్యం. అతనిప్పుడే వచ్చాడు. తనదైన ముద్ర వేసేంత ఎక్కువ అవకాశాలు రాలేదు. ఏదేమైనా అతడు మా ప్రణాళికల్లో ఉంటాడు' అని హిట్‌మ్యాన్ అన్నాడు.
'భారత్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. అందుకే జట్టులో వేర్వేరు కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మా టాప్-5 బ్యాటర్లలో సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే బౌలింగ్ చేయగలరు. కానీ వారు రెగ్యులర్ బౌలర్లు కాదు. ఇప్పుడేస్తున్నట్టు బాగా బౌలింగ్ చేస్తే ఆరో, ఏడో బౌలింగ్ ఆప్షన్‌తో పెద్దగా పనిపడదు. అలాంటి అవకాశాలు ఉంటే మాత్రం కెప్టెన్‌కు కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది' అని రోహిత్ తెలిపాడు.
Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్ ఛాపెల్..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి