కడప జిల్లాలో వరదలు సృష్టించిన బీభత్సం ఇంకా కళ్ల ముందే ఉంది. అలా వచ్చిన వరద ఇలా మనుషుల్ని , ఆస్తిపాస్తుల్ని  తనతో పాటు తీసుకెళ్లిపోయింది. దీనంతటికి కారణం మానవతప్పిదమేనని విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం మానవ తప్పిదమేమీ లేదని అసాధారణ వర్షం , ఎగువ నుంచి వర్షం రావడం వల్లనే ఈ నష్టం జరిగిందని చెబుతున్నారు. అసలు వర్షం , వరద విషయం ఏం జరిగిందో కడప కలెక్టర్ విజయరామరాజు  స్పష్టమైన నివేదికను కేంద్రానికి పంపారు.




Also Read : ఆ 60 మందివి ప్రభుత్వ హత్యలే, ఆ ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం.. చంద్రబాబు వ్యాఖ్యలు


వాన, వరద... అసలేం జరిగిందంటే ? 


నవంబర్‌  18వ తేదీ, గురువారం ఉదయం 8:30 గంటలకు పింఛ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో కేవలం 3,845 క్యూసెక్కులు మాత్రమే ఉంది. కాని అదే రోజు సాయంత్రం 6 నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్కులకు పెరిగింది. ఇక గురువారం ఉదయం 8 గంటలనుంచి శుక్రవారం ఉదయం వరకూ కడప జిల్లాలోని మొత్తం 50 మండలాల్లో కూడా సగటున 10.7  సెం.మీ వర్షపాతం కురిసింది.  దీనికితోడు తిరుపతి సహా చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో  శేషాచల పర్వతశ్రేణికి వెనకవైపున కురిసిన భారీ వర్షాలు, వాటి వరదనీరు అంతా చెయ్యేరు పరీవాహక ప్రాంతానికి చేరుకుంది. మరోవైపు పీలేరులో, రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది. ఇదంతా ఏకకాలంలో జరిగింది. అన్ని వైపుల నుంచి ఒక్క సారిగా నీరు చెయ్యేరు వైపు వచ్చింది. కడప జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటలకు వరద వచ్చి పడింది.




Also Read : చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సంఘటన... లేచి నిలబడి నమస్కారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి


తట్టుకోలేకపోయిన పింఛ.. అన్నమయ్య ప్రాజెక్టులు !


చెయ్యేరు నదిపై మొదట పింఛా ప్రాజెక్టు, దానికింద అన్నమయ్య ప్రాజెక్టు ఉంది.  పింఛా డ్యాం మొత్తం నీటి విడుదల సామర్థ్యం కేవలం 48వేల క్యూసెక్కులు మాత్రమే. నవంబర్‌ 18వ తేదీ, గురువారం సాయంత్రం పింఛాకు 50వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కూడా ఉంది.  18వ తేదీ అర్ధరాత్రి పింఛా ప్రాజెక్టులో 1.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. విడుదల సామర్థ్యం కన్నా ఇది రెండు రెట్లు ఎక్కువ.  రింగ్‌బండ్‌ను ప్రొటెక్ట్‌చేసినా.. ఈ నీటిని అడ్డుకోలేనిపరిస్థితి ఏర్పడింది. అదే రోజు రాత్రి 1 గంట సమయానికి అన్నమయ్యలో ఇన్‌ఫ్లో 2.3 లక్షలకు చేరుకుంది.  నవంబర్‌ 19, శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఉదయం 5:30 గంటలకు 3.2 లక్షలు దాటింది. దీంతో పింఛా ప్రాజెక్ట్ తెగిపోయి మొత్తం నీరంతా ఒకేసారి అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు కానీ ఇన్ ఫ్లో 3.2 లక్షలు దాటింది.  అన్నమయ్య ప్రాజెక్టు కట్టినత తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఇంత నీరు ఎప్పుడూ రాలేదు. ఫలితంగా 19 వ తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డ్యాం తెగిపోయింది. ఊళ్లను ముంచెత్తింది.


Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !


చెయ్యేరు తీర గ్రామాలన్నింటినీ ముందస్తుగానే అప్రమత్తం ! 


పరిస్థితి దిగజారుతోందని తెలిసిన వెంటనే 18వ తేదీ సాయంత్రం 6 గంటలకే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యిందని కలెక్టర్ ప్రకటించారు. వాలంటీర్, వీఆర్వోలనుంచి మొత్తం అందర్నీ అలర్ట్‌ చేశారు.  అన్నమయ్య కింద కుడివైపు ఉన్న పుల్లపొత్తూరు, దిగుమందూరు, కేశాంబవరం, గండ్లూరు.. హేమాద్రిపురం తదితర గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించామని ప్రకటించారు. అక్కడున్న వారందర్నీ అప్రమత్తం చేశామని..లోతట్టులో ఉన్న సుమారు 400 కుటుంబాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించామని కలెక్టర్ ప్రకటించారు.  8వ తేదీ సాయంత్రం నుంచి యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి, వందలమంది ప్రాణాలను కాపాడామని కలెక్టర్ తెలిపారు. అయితే నందులూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న 4 బస్సులు ముంపునకు గురయ్యాయి.  అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామంలో నదితీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శివాలయంలో పూజలు చేస్తున్న పూజారి కుటుంబం ప్రమాదానికి గురయ్యింది. ఈ రెండు ఘటనల్లోనే సుమారు 20 మంది వరకూ మరణించడం, గల్లంతు కావడం జరిగింది.  అధికార యంత్రాంగం అప్రమత్తత వల్లే వందలమంది ప్రాణాలు కాపాడగలిగామని కలెక్టర్ నివేదికలో తెలిపారు.


Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !


ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు !


ముంపు తగ్గగానే శనివారం ఉదయం నుంచి ముంపు గ్రామాలకు, తాగునీరు, ఆహారం అందించామని..   జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను చేపడుతూనే అన్నమయ్య ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశామని కలెక్టర్ చెప్పారు. అన్నమయ్య డ్యాం తెగిన సుమారు 24 గంటల తర్వాత కూడా నీటి మట్టం తగ్గలేదు.ని..ఈలోగా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి హెలికాప్టర్లు తెప్పించి... సహాయ కార్యక్రమాలు కొనసాగించారు. హెలికాప్టర్లు..., బోట్ల ద్వారా తాగునీరు, ఆహారాన్ని అందించారు.  వరద తగ్గగానే వాలంటీర్లు నదీతీర ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ పరిశీలించారు.  బాధిత కుటుంబాల్లో ఇంటికి చేరగానే.. ప్రతి ఒక్కరి వివరాలూ నమోదు చేసుకుని పరిహారం ఇచ్చారనితెలిపారు. మృతదేహాలు దొరికిన వారికి వెంటనే రూ.5 లక్షల పరిహారం రేషన్‌ సరుకులను, ముంపునకు గురైన కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం అందించామని కలెక్టర్ తెలిపారు. 


Also Read:  పెద్ద హీరోల సినిమాలకు కోలుకోలేని దెబ్బ ! టాలీవుడ్ కింకర్తవ్యం ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి