కంటికి రెప్పలా కన్న కూతున్ని కాపాడుకోవాల్సిన కన్న తండ్రి పశువులా ప్రవర్తించాడు. కామ దాహంతో ఏకంగా కన్న కూతుర్నే చెరిచాడు. దాదాపు ఏడాది కాలంగా ఆమెను భయపెట్టి, బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. చివరికి బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే కొద్దికాలంగా కూతురిపై అత్యాచారం చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ విషయం బయటికి వచ్చింది.
పోలీసులు, బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ ఊరిలో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు వలస వచ్చారు. భార్య ఓ వెంచర్‌లో హెల్పర్‌గా పని చేస్తుండగా, భర్త ఆటో నడుపుతున్నాడు. 15 ఏళ్ల వయసుఉన్న పెద్ద కుమార్తె ఇంటి వద్ద ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడు. ఇటీవల తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి సొంత ఊరికి వచ్చింది. పెద్ద కూతురు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలిక మూడో నెల గర్భవతి అని డాక్టర్లు తేల్చారు. అవాక్కయిన తల్లి కూతురుని అనుమానించి తిట్టగా.. ఆమె అసలు విషయం తెలిపింది. అనంతరం భర్త వద్దకు వెళ్లి ప్రశ్నించింది. అతడు అందర్నీ చంపేస్తానని బెదిరించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు గర్భస్రావం చేయించేశాడు.
పెద్ద కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం మోమిన్‌పేటకు చేరుకుని కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Visakhapatnam: అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు
Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్
Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్