ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలు అతి భారీ వర్షాలతో చిగురుటాకులా వణుకిపోయిన సంగతి తెలిసిందే. కడప, చిత్తూరు, అనంతపురం వంటి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఇంకా వరద నష్టం నుంచి కోలుకోకముందే మరో అల్ప పీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వర్షాలపై వాతావరణ శాఖ అంచనా వేసింది.
‘‘నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఏర్పడవచ్చు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకొనే అవకాశం ఉంది.
ఈ ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది.
ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానం ప్రాంతాల్లో..నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలో ఇలా..ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
దక్షిణ కోస్తాంధ్రలో..ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.’’ అని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ప్రకటించారు.
తెలంగాణలో ఇలా..తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 5 రోజులకు సంబంధించి వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. 25న పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది.
Also Read: జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి... కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్... 32 మందిపై కేసులు
Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !
Also Read: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సంఘటన.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏం చేశారంటే..