హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు. మేయర్ ఛాంబర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో జీహెచ్ఎంసీ కార్యాలయంలో వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ కార్పొరేటర్ల దాడిని మంత్రి కేటీఆర్ ట్విటర్‌ లో ఖండించారు. బీజేపీ చెందిన కొందరు దుండగులు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో దాడికి పాల్పడ్డారని, ఇది సరికాదన్నారు. గాడ్సే అనుచరులు గాంధీ మార్గంలో ఎలా నడుస్తారని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. 






Also Read: కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..


32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు


హైదరాబాద్ లిబర్టీ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు  మేయర్‌ ఛాంబర్‌, కార్యాలయంలో ఫర్నిచర్‌, పూల కుండీలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారన్న కారణంగా 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్‌ సీఐ సైదిరెడ్డి తెలిపారు. 


Also Read: ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్‌ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !


జీహెచ్ఎంసీ కార్యాలయం పాలతో శుద్ధి


టీఆర్ఎస్ కార్పొరేటట్లు జీహెచ్ఎంసీ ప‌రిస‌రాలు, లోగోను పాల‌తో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేట‌ర్ల ధ‌ర్నాపై టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ధ‌ర్నా జీహెచ్ఎంసీ చ‌రిత్రలో చీక‌టి రోజు అని పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేట‌ర్లపై అన‌ర్హత వేటు వేయాల‌ని కోరారు. అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వలేక‌పోతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేట‌ర్లు ప‌ద్ధతి మార్చుకోవాల‌ని టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు వార్నింగ్ ఇచ్చారు. 


Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !


Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి