Primary Health Care: ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

ABP Desam Updated at: 24 Nov 2021 02:57 PM (IST)
Edited By: Murali Krishna

భారత్‌లో పట్టణాలు, నగరాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇప్పటికే ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంకుతో ఒప్పందం కుదిరింది.

ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

NEXT PREV

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి భారత ప్రభుత్వం, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వనుంది. మొత్తం 13 రాష్ట్రాల్లో 25 కోట్ల మందికి పైగా దీని వల్ల లబ్ధిపొందనున్నారు. 



భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మిషన్ వంటి వాటికి ఈ కార్యక్రమం ద్వారా మరింత బలం చేకూరనుంది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేందుకు ఇది ఉపయోగపడనుంది.    -      రజత్ కుమార్ మిశ్రా, ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ


ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా మోదీ సర్కార్ ప్రకటించింది. దీంతో జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10 కోట్ల కుటుంబాల వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే.


అయితే కరోనా సంక్షోభం తర్వాత దేశంలోని ఆరోగ్య శాఖపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం మరింత విస్తరించింది. భవిష్యత్‌లో ఎలాంటి మహమ్మారులు వచ్చిన ఎదుర్కొనేలా పటిష్టం చేసింది.


ఈ రాష్ట్రాల్లోనే..


ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, బంగాల్ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. 


కరోనా వంటి అంటురోగాలే కాకుండా సాధారణ వ్యాధులకు కూడా హెల్త్ ప్యాకేజీలను ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తీసుకురానుంది. వీటిపై అవగాహనా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యంపై చైతన్యం పెంచేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టనుంది.


Also Read: Farm Laws Repeal: వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం.. తొలిరోజే సభకు!


Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!


Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్


Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి


Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 24 Nov 2021 02:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.