కృష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయతీ చైర్మన్‌గా టీడీపీకి చెందిన కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబును పదహారు మంది బలపరిచారు . ఫలితాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. తెలుగుదేశం పార్టీకి 15 మంది కౌన్సిలర్ల బలం ఉండగా ఎక్స్ అఫీషియో ఓటును ఎంపీ కేశినేని నాని ఉపయోగించుకున్నారు. ఈ కారణంగా టీడీపీ బలం 16కి చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగించుకోవడంతో వారి బలం 15కు చేరింది. కానీ ఒక్క ఓటు టీడీపీకి ఎక్కువగా ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు ఆ పార్టీకే దక్కాయి. 


Also Read : రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !


కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి తీవ్ర ఉద్రిక్తలకు కారణం అవుతున్నాయి. కౌంటింగ్‌లో మొత్తం 29 మంది కౌన్సిలర్ స్థానాలకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపలకు చెరో 14 స్థానాలు దక్కాయి. ఓ టీడీపీ రెబల్ అభ్యర్థి గెలిచారు. ఆ అభ్యర్థి వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు అధికంగా ఉన్నట్లయింది. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకుని పీఠం కైవసం చేసుకుంటామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 


Also Read : మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..


అయితే టీడీపీ తరపున విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు విచారణ జరిపి ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే తుది ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఎన్నిక నిర్వహించాలని అనుకున్నా.. వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో వాయిదా పడింది. మంగళవారం కూడా అంతే వాయిదా పడింది. 


Also Read: Tomato Price Today: పెట్రోల్ రేట్లను దాటేసిన టమోటా.. కొన్నిచోట్ల రూ.140, సడెన్‌‌గా పెరుగుదల ఎందుకు?


ఈ క్రమంలో అధికార పార్టీ నేతలతో కలిసి అధికారులు కుమ్మక్కయి ఎన్నికను నిర్వహించడం లేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన హైకోర్టు రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇంచార్జ్ సీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత కల్పించాలని.. ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దాదాపుగా 700 మంది పోలీసులతో భద్రత కల్పించి ఎన్నిక నిర్వహించారు. వీడియో తీశారు. ఈ వీడియోను హైకోర్టుకు సమర్పించనున్నారు. తుది ఫలితం హైకోర్టు తీర్పును బట్టి ఉంటుంది. 


Also Read : ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి