శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ట్రావెల్స్ యాజమాన్యం పరారవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ఆ ట్రావెల్స్ సంస్థను నమ్ముకొని వెళ్లిన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. టూరిస్టులను నట్టేట ముంచినట్లుగా వారందరినీ ట్రావెల్ ఏజెన్సీ యాత్ర మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదురైన సమస్యలకు యాత్రికులు నానా యాతన పడుతున్నారు. అసలేం జరిగిందంటే..


కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా అకుల్ టూరిజం పేరుతో ఓ ట్రావెల్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ దేశంలోని వేర్వేరు పుణ్యక్షేత్రాలకు, పర్యటక ప్రదేశాలకు బస్సులను తిప్పుతుంటారు. ప్రత్యేక ప్యాకేజీలు వసూలు చేసి యాత్రికులను గమ్యస్థానాలకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్యాకేజీని ప్రకటించారు. మనకు గోదావరి పుష్కరాల తరహాలోనే ఉత్తరాదిన ఉండే సింధూ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఓ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించారు.


Also Read: Hyderabad Crime: 40 ఏళ్లయినా పెళ్లికాలేదని తొందరపడితే కోటి పోయింది..


ఈ క్రమంలోనే శ్రీకాకుళం నుంచి పలువురు యాత్రికులు అకుల్ ట్రావెల్స్ యాజమాన్యం ద్వారా సింధూ పుష్కరాలకు వెళ్లారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేశారు. ఇలా జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాక యాత్రికులను వదిలేసి అకుల్ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పరారయ్యారు. దీంతో దాదాపు 120 మంది యాత్రికులు దిక్కులేని వారయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్లో యాత్రికులంతా చిక్కుకుపోయారు. వారు వెళ్లిపోయేందుకు హోటల్ యాజమాన్యం అంగీకరించడం లేదు. డబ్బులు కట్టాలని 120 మందిని హోటల్ యాజమాన్యం నిర్బంధించింది. ఒక్కొక్కరు రూ.పది వేలు కట్టాలంటూ యాత్రికులను నిర్బంధించింది. 


హోటల్‌ సిబ్బంది నిర్బంధించడంతో దిక్కుతోచని స్థితిలో యాత్రికులు ఉన్నారు. హోటల్‌‌లో చిక్కుకుపోయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట వాసులు ఉన్నారు. వారంతా తమను విడిపించాలని వేడుకుంటున్నారు.


Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !


Also Read: ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు


Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష


Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్స్‌.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..


Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 


Also Read: Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత... ఓ ప్రయాణికుడి వద్ద 9 ఐఫోన్లు స్వాధీనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి