శంషాబాద్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ లో మరోసారి బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. బంగారం, విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ పలువురు అధికారులకు చిక్కుతున్నారు. రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. యూఏఈ, యుఎస్ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11.49 లక్షల విలువైన యూఏఈ కరెన్సీ, యుఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మరో మహిళ దగ్గర రూ. 17.69 లక్షలు విలువ చేసే బంగారం బిస్కెట్లను ఎయిర్ పోర్ట్ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.






Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..






మరో 9 ఐఫోన్లు స్వాధీనం


మరో కేసులో ఐఫోన్లు అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం షార్జా నుంచి జీ9-458 విమానంలో వచ్చిన ప్రయాణికుడు 9 ఐఫోన్‌ 13 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ. 8.37 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. 


Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి