ఆంధ్రప్రదేశ్ లో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 18,777 మంది నమూనాలు పరీక్షించారు. కొత్తగా 127 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 184 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,488 కరోనా కేసులు నమోదుకాగా 249 మంది మృతి చెందారు. కొత్త కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకోగా.. యాక్టివ్ కేసులు 534 రోజుల కనిష్ఠానికి చేరాయి.
- మొత్తం కేసులు: 3,45,18,901
- మొత్తం మరణాలు: 4,65,911
- యాక్టివ్ కేసులు: 1,18,443
- మొత్తం రికవరీలు: 33,934,547
తాజాగా 12,510 మంది కరోనాను జయించారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.34%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యల్పం.
శాంపిళ్లు..
ఇప్పటివరకు 63,25,24,259 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఆదివారం 7,83,567 శాంపిళ్లు పరీక్షించారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది (ఐసీఎంఆర్).
కేరళ..
కేరళలో కొత్తగా 5080 కేసులు నమోదుకాగా 40 మంది మృతి చెందారు. 7908 మంది కరోనా నుంచి కోలుకున్నారు.