సీఆర్‌డీఏ(CRDA) చట్టాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీ పాలనా వికేంద్రీకరణ, సమీకృత అభివృద్ధి చట్టం ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో రద్దు చేసిన సీఆర్‌డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ, ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్‌డీఏకు బదిలీ చేస్తున్నట్లు తాజా బిల్లులో తెలిపారు. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేస్తామని బుగ్గన ప్రకటించారు. తక్షణమే సీఆర్‌డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో స్పష్టం చేశారు. 



Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?


తెలంగాణ అభివృద్ధిలో ముందుంది


ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయన్నారు. భాషా ప్రాతిపదిక ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ 2014లో రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ఆరు క్లాసికల్ భాషలో తెలుగు ఒకటన్నారు. భారత్‌లో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉందన్నారు. తెలంగాణవాదం వచ్చినప్పుడు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. ఆ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఉత్తరాంధ్ర, రాయలసీమల వెనుకబడిన ప్రాంతాలుగా శ్రీకృష్ణ కమిటీ గుర్తించింది. హైదరాబాద్‌ రాజధానిగా కలిగిన తెలంగాణ అభివృద్ధిలో ఒక మెట్టు పైనే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత కేంద్రం శివరామకృష్ణతో ఒక కమిటీ వేసిందని గుర్తుచేశారు.  


Also Read: సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?






శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏంచెప్పిందంటే...


శివరామకృష్ణ ఏపీలో 13 జిల్లాలు ఉంటే 10 జిల్లాల్లో స్వయంగా పర్యటించి నివేదిక సమర్పించారమని బుగ్గన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌లో ఉత్తమమైన రాజధానిగా నిలిచే ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న ఆ కమిటీ అసైన్‌మెంట్‌ అన్నారు. శివరామకృష్ణ నివేదికలో రాజధానిపై ఒక ప్రత్యేక ప్రాంతమని ఎక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణ నుంచి విడిపోవటం వల్ల చాలా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని, అలాంటివి భవిష్యత్‌లో ఎదురుకాకుండా ఉండాలంటే పాలనలో వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ నివేదిక స్పష్టం చేశారన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రా, రాయలసీమతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన వివరించారన్నారు. 


Also Read: త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి