నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. దీని కంటే ముందు ఆయన తీసిన సినిమా 'ట్యాక్సీవాలా'. అది లో బడ్జెట్ సినిమా. అయినా సరే... కథపై నమ్మకంతో నిర్మాత వెంకట్ బోయినపల్లి భారీగా తీశారు. సినిమాకు దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు ఫిల్మ్ నగర్ టాక్. కరోనా నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అంత రేటు పెట్టి సినిమాను కొంటారా? అని కొంత మంది సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హిందీ రైట్స్ రూపంలో నిర్మాతకు భారీ మొత్తం వచ్చింది. ఓ విధంగా ఇది లాభసాటి బేరం.
'శ్యామ్ సింగ రాయ్' హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మేశారు. బిఫోర్ యు టీవీ ఛానల్ రూ. 10 కోట్లు పెట్టి హిందీ డబ్బింగ్ రైట్స్ దక్కించుకుంది. బెంగాల్ నేపథ్యంలో తీసిన సినిమా కావడంతో ఉత్తరాది ప్రజలు సినిమాను చూసే అవకాశాలు ఉన్నాయి. అందుకని , సినిమా హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ మంచి రేటు పలికాయి. డిసెంబర్ 24న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు హిందీ డబ్బింగ్ టీవీలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
'శ్యామ్ సింగ రాయ్'లో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. టీజర్‌లో నాని, కృతి మధ్య చిన్న లిప్ లాక్ చూపించారు. ప్రజెంట్ ఎపిసోడ్‌లో ఆమె హీరోయిన్ కాగా... ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో సాయి పల్లవి హీరోయిన్. మడోన్నా సెబాస్టియన్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. నాని డ్యూయల్ రోల్ చేసినట్టు టీజర్ చూస్తే ఎవరైనా చెబుతారు. యూట్యూబ్ లో టీజర్ ట్రెండ్ అయ్యింది.





 

Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితి.. ఇప్పటికీ విషమంగానే..
Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి