సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆయన ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం మరోసారి ప్రత్యేక బులిటెన్ విడుదల చేశారు.
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
వెంటిలేటర్ మీదే ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కైకాల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోందని.. బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయని, వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని బులిటెన్‌లో పేర్కొన్నారు.
ఈరోజు ఉదయాన్నే ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం తనకు కలిగిందని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలియగానే... ఆయన్ను ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ను ఫోనులో పలకరించానని.. ఆయన త్వరగా కోలుకుంటాన్న పూర్తి నమ్మకం కలిగిందని చిరు రాసుకొచ్చారు.
1959లో 'సిపాయి కూతురు' అనే సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 777 చిత్రాల్లో నటించారాయన. నవరస నటనా సార్వభౌమగా చిత్రపరిశ్రమ, అభిమానులు ఆయన్ను పిలుచుకుంటూ ఉంటారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల టాలెంటెడ్ నటుడు కైకాల. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోస్తాడు. ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది కైకాల మాత్రమే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు.1960లో నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
Also Read: విజయ్ దేవరకొండతో అనన్య పాండే హార్స్ రైడింగ్..
Also Read:ప్లాన్ మార్చేసిన 'విరాటపర్వం'.. ఓటీటీ డీల్ క్యాన్సిల్..
Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి