మేషం
మీరు మీ బాధ్యతలను నిర్వర్తించగలరు.  కొత్త పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వ్యాపారస్తులకు శుభసమయం. ఏదో ఒక సమస్య కారణంగా ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. 
వృషభం
ఉద్యోగం,  వృత్తి కోసం ఎక్కువ శ్రమ పడతారు. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏది సరైనది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో సంకోచించకండి.  ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.
మిథునం
మీరు ఏదైనా కార్యక్రమం లేదా ఆటలో పాల్గొంటారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలంటే మీ బడ్జెట్ కి మించి ఖర్చు చేయవద్దు. కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త సమాచారం అందుతుంది. రిస్క్ తీసుకోవద్దు.
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
కర్కాటకం
వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఓ శుభవార్త మీ ముఖంలో ఆనందాన్ని తెస్తుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. యువతకు కొత్త సమాచారం అందుతుంది. వృత్తి సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. 
సింహం
స్నేహితులను కానీ బంధువులను కానీ కలుస్తారు.  అప్పుల నుంచి విముక్తి పొందుతారు. కొన్ని పనుల కారణంగా చాలా కాలంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి తీసుకోకపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇంట్లో ఉన్న పెద్దలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
కన్య
ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. మీరు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లొచ్చు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాసం ఉంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. బయట తినొద్దు. 
Also Read:  పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
తుల
మీ సంసార బంధంలో అపార్ధాలు తలెత్తకుండా చూసుకోండి. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది.  ఏదైనా పని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. శత్రువులు చాలా చురుకుగా ఉంటారు. మీరు నష్టపోయే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల మద్దతు పొందుతారు.
వృశ్చికం
రోజూ కన్నా ఈ రోజు మీ దినచర్య మెరుగుపడుతుంది. ఎవరిపైనా పగ పెంచుకోవద్దు. మీరు సామాజికంగా ప్రశంసలు అందుకుంటారు.  కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.  శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆర్థిక పరిస్థి బావుంటుంది. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. అనవసరంగా ఖర్చు పెట్టొద్దు. టెన్షన్ తగ్గుతుంది. 
ధనుస్సు
మీరు చాలా కాలం తర్వాత దూరపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.  మీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది. దూర ప్రయాణాలు చేయొద్దు, గాయాలయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ మాటలను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. సమస్య తీరిపోతుంది. 
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
మకరం
అవాంతరాలను వదిలి మీ భాగస్వామితో సంతోష సమయాన్ని గడపండి.  మీ కష్టానికి క్రెడిట్ ఎవ్వరూ తీసుకోలేరు. ఈ రోజు మీరు కొన్ని మతపరమైన సంక్షోభాల్లో చిక్కుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. తెలియని వ్యక్తుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.
కుంభం
ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  పెద్ద బాధ్యతలను పూర్తి చేస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి. మీ పని తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు.  రిస్క్ తీసుకోవద్దు.  కొత్త సమాచారం అందుతుంది. వ్యాపార పనులపై ప్రయాణాలు చేస్తారు. 
మీనం
ఆరోగ్యం క్షీణించవచ్చు. రోజంతా బిజీగా ఉంటారు. ఏంత పనిచేసినా అలసట అనిపించదు. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. వ్యాపారంలో మందగమనం కారణంగా సమస్యలు పెరుగుతాయి. వివాదాలు తగ్గాలంటే పెద్దలతో చర్చించాలి.  కుటుంబంతో సమయం గడపండి. అప్పు ఇవ్వకండి, ప్రయాణాలు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. 
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read:  సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి