మార్కెట్ కి వెళితే మహా అయితే ఆకుకూరలు, కూరగాయలు కలపి మహా అయితే ఓ 30 రకాలు ఉంటాయేమో. వాటిలో కొనుక్కున్నా వారానికి సరపడా ఓ పది రకాలు కొంటారు. మరి ఈ వెయ్యి ఎనిమిది లెక్క ఎక్కడినుంచి వచ్చిందంటారా. ఈ ప్రస్తావన ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు పురాణాల్లోకి వెళ్లాలి. ఓ సారి తన తండ్రి తద్దిన సందర్భంగా భోక్తగా ( భోజనానికి) రమ్మని వశిష్ఠ మహర్షి... విశ్వామిత్రుడిని పిలిచారు. సరే అన్న విశ్వామిత్రుడు ఓ షరతు విధించాడు.తనకు వెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి వడ్డించాలని అడగ్గా.. వశిష్ట మహర్షి అందుకు అంగీకరించి తన భార్య అరుంధతికి చెబుతాను అన్నారు.
కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే
ఈ శ్లోకం అర్థమేంటంటే...శ్రాద్ధ సమయంలో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. వజ్రవళ్ళి (నల్లేరు) పచ్చడి మూడు వందల కూరలకు సమాన. పనసపండు ఆరు వందల కూరలకు సమానం. ఈ మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించాను అని చెప్పి నమస్కరించింది. అది విన్న విశ్వామిత్రుల వారు భోజనం చేసి వెళ్లిపోయారు.
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...Also Read: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివిAlso Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి