నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం


ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు.  శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం.  శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలున్నాయి.  ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే. పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు. ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా.. ముందుగా శివం-పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది.
Also Read:  పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు.  జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే. ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు. 
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో.... శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు. ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. అది సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు. 
Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
Also Read: వెయ్యేళ్లనాటి ఆ ఆలయం చుట్టూ రంధ్రాలు... ఎందుకో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి