మేషం
కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆకస్మిక లాభాలను పొందుతారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. మీ జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి.  రిస్క్ తీసుకోకండి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. 
వృషభం
ఖర్చులు తగ్గుతాయి. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు శుభదినం. జీవిత భాగస్వామితో కాస్త టెన్షన్‌ ఉండొచ్చు.  శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. పాతమిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది.
మిథునం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఏదో ఒక విషయంలో టెన్షన్ పడతారు. అలాంటి పరిస్థితిలో మీరు ఎవ్వరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండాలి. ఈరోజు బంధువులను కలిసే అవకాశం ఉంది.  ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పెట్టుబడి ద్వారా లాభాలొస్తాయి. 
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
కర్కాటకం
కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరుకుతుంది. మీ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి. వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. 
సింహం
విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. యువతకు ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. స్నేహితుల సాయంతో ఓ పని పూర్తిచేస్తారు. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్య
రోజు అద్భుతంగా ఉంటుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈరోజు ప్రశంసలు లభిస్తాయి. లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి.మీ పూర్తి బాధ్యతను నిర్వర్తించగలరు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
తుల
వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి,  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. ఈ రోజు మీకు అన్ని పనులకు అనుకూలమైన రోజు.
వృశ్చికం
మీరు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల సలహా మేరకు పని చేస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఈరోజు మీ ఆందోళనలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు సహనంతో పని చేయాల్సి ఉంటుంది. సామాజిక జీవితంలో మీరు ప్రశంసలు అందుకుంటారు.
ధనుస్సు
పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ప్రేమికుల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. పాత పనికి మంచి ఫలితాలు వస్తాయి... కొత్త పని దొరుకుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు చాలా బిజీగా ఉంటారు.  ఈ రాశిలో జన్మించిన వారు ప్రమాదాలకు దూరంగా ఉండాలి. 
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
మకరం
అనవసరంగా ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.  కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.  పెండింగ్ కేసులపై శ్రద్ధ వహించండి.  స్నేహితులతో సంతోషంగా గడపుతారు. మంచి సమాచారం అందుతుంది. మీరు కొత్త ప్రణాళికను ప్రారంభించడం గురించి ఆలోచించవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం
కొత్త అవకాశాలు అందుకుంటారు.  ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. జీతభత్యాలు ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారస్తులు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. 
మీనం
ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా పనిచేయండి.  ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈరోజు అద్భుతంగా ఉంటుంది.  మీరు మీ పనిపై దృష్టి పెడతారు.
 Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి