ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయిన 60 మందివి హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వారి ఒక్కో కుటుంబానికి పాతిక లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాల ధాటికి వరి, చెరకు, పత్తి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, మామిడి పంటలకు పరిహారం పెంచాలని కోరారు. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందని విమర్శించారు. భారీ వర్షాలు పడతాయని తెలిసినా ప్రజలతో ఆడుకున్నారని అన్నారు. గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుపతి లక్ష్మీపురం సర్కిల్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకలేదని అన్నారు. భర్త నీటిలో కొట్టుకుపోవడంతో ఆ ఆవేదన తట్టుకోలేక భార్య అనారోగ్యానికి గురైందని అన్నారు. ఇప్పటికీ కడప జిల్లాలో ఆరు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయని గుర్తు చేశారు. రాయలచెరువు ప్రాంత ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ‘‘తిరుపతిలో పర్యటిస్తున్నానని హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరద నీటిని శుభ్రం చేశారు. వరద బాధితుల ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం. మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించాలి. తుమ్మలగుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాలి. తప్పిదానికి కారణమైన వారిని శిక్షించాలి.
‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులను చూసి ఆవేదన చెందా. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40 వేల మందిని ఆదుకున్నాం. నిరాశ్రయులకు అవసరమైన భోజన సదుపాయాలను మేం కల్పించాం. పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో కూడా అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమయింది. కపిల తీర్థం నుంచి కొండపక్కనే కాలువ తీయాలి. కపిల తీర్థం నీరు స్వర్ణముఖి నదిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. రంగులు వేయడానికి, తీయడానికి రూ.6 వేల కోట్లు అనవసర ఖర్చు చేశారు. అనవసర ఖర్చులు చేస్తూ అవసరమైన వాటికి ఖర్చు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను సక్రమంగా ఖర్చు పెట్టండి. వరదల్లో 62 మంది చనిపోయారు’’
‘‘మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వరద బాధితులను ఆదుకోవడానికి వెళితే కేసులు పెడతారా.. రాయలచెరువుకు వెళ్ళొద్దని నోటీసులు పెడతారా? వరద బాధితులను ఆదుకోకుంటే పోరాటం చేస్తాం. త్వరలో వరద బీభత్సంపై ఏపీ సీఎస్‌కు లేఖ రాస్తా.. కడపలో వరద భీభత్సం సృష్టిస్తే అసెంబ్లీ పెట్టుకుంటారా..? వరద నీటిలో దిగి సీఎం ఎందుకు పరామర్శించలేదు? వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు కుటుంబానికి ఏం సమాధానం చెబుతారు..? తిత్లి, హుదూద్ తుపాను సమయంలో బాధితులను అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది.’’ అని చంద్రబాబు మాట్లాడారు.
Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !
Also Read: Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..
Also Read : క్రిప్టోపై బిల్లుపై కేంద్రం ప్రకటన.. సూర్యాపేటలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య