ఓ వైపు కార్తీకమాసం మరోవైపు అయ్యప్ప మాలధారులు ఇంకోవైపు ముంచెత్తిన వానలు-వరదలు వీటన్నింటి ప్రభావం కూరగాయలపై పడింది. అసలే ధరలు మండిపతున్నాయంటే నేనే రాజు నేనే మంత్రి అంటోంది టమాటా. సాధారణంగా కూరలు, రసం, పప్పు, సాంబార్ ఇలా ఏం వంటకంలో అయినా ఉల్లిగడ్డల తర్వాత స్థానం టమాటాదే. అయితే ఇప్పుడు ఆ టమాట ధర విపరీతంగా పెరిగింది. ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల పంటలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో ఈ ప్రభావం ఇతర ప్రాంతాలపై పడింది. టమాట రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తుంది. ఇటీవల ఆ ప్రాంతాల్లో వరదల రావడం ఓ కారణమైతే, మిగిలిన ప్రాంతాల నుంచి సరైన రవాణా సౌకర్యం లేక టమాటాలు దిగుమతి కాలేదు. దీంతో అందమైన, రుచికరమైన టమాటాని చూడాలంటే భయపడిపోతున్నారు వినియోగదారులు.
Also Read: అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
అయితే ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు టమాటాకి ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచనలో పడ్డారు వినియోగదారులు. ఉల్లిగడ్డల ధరలు భారీగా పెరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా క్యాబేజీ వాడుతుంటారు. అలా టమాటాకి ప్రత్యామ్నాయంగా ఏంటా అని ఆలోచిస్తే చాలామంది నుంచి వినిపించిన సమాధానం చింతపండు, నిమ్మకాయ, ఉసిరి అని. టమాటా నుంచి వచ్చే పులుపు కూరలకు మంచి రుచి అందిస్తుంది. ఇప్పుడు టచ్ చేసి చూడు అని సవాల్ విసురుతోన్న టమాటా బదులు చింతపండు, నిమ్మకాయ, ఉసిరితో ఆలోటు పూడ్చుకోవాలన్నమాట.
Also Read: చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు
అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు...కూరగాయల ధరలన్నింటి కన్నా ఉల్లిగడ్డలు, టామాటాలది విచిత్రమైన పరిస్థితి. ఒక్కోసారి కిలో రెండు రూపాయలు,మూడు రూపాయలకు దొరుకుతాయి, ఇంకోసారి కనీసం పెట్టుబడి కూడా రావడం లేదంటూ రోడ్లపై పారబోసి రైతులు నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నట్టుండి సెంచరీ దాటిపోయి వినియోగదారులను బెంబేలెత్తించే పరిస్థితులూ గతంలో చూశాం..ఇప్పటికీ చూస్తున్నాం. మరి రుచికరమైన టమాటా సామాన్యుడి వంటింట్లోకి ఎప్పడొస్తుందో చూద్దాం.....
Also Read: వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?
Also Read: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి